‘ఆధార్‌’ తప్పనిసరేం కాదు | 'Aadhar' card not mandatory for non-resident Indians filing tax returns | Sakshi
Sakshi News home page

‘ఆధార్‌’ తప్పనిసరేం కాదు

Published Tue, Apr 11 2017 2:54 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM

‘ఆధార్‌’ తప్పనిసరేం కాదు

‘ఆధార్‌’ తప్పనిసరేం కాదు

సబ్సిడీలు కొనసాగుతాయని రాజ్యసభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: సంక్షేమ పథకాల పరిధి నుంచి లబ్ధిదారుల్ని తప్పించేందుకే ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శల్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆధార్‌ అనుసంధానంతో ఏ పేద వ్యక్తి సబ్సిడీ లబ్ధి కోల్పేయే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

రాజ్యసభలో ఆధార్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రతిపక్షాల అభ్యంతరాలకు  న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ సమాధానమిస్తూ... ‘పేదలకున్న సబ్సిడీ హక్కును నిరాకరించం. మధ్యాహ్న భోజనం, ఇతర పథకాల లబ్ధికి ఆధార్‌తో రమ్మని చెపుతున్నాం.  పథకాల లబ్ధిని తిరస్కరించడం లేదు’ అని అన్నారు.  సబ్సిడీ పథకాల నుంచి లబ్ధిదారుల్ని తొలగించేందుకు ఆధార్‌ వ్యవస్థను వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ సభ్యుడు జైరాం రమేష్‌ ఆరోపించారు.

సీబీఐ, ఈడీల దుర్వినియోగం:
ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్, సీబీఐల్ని ప్రయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సభ కార్యక్రమాల్ని పక్కనపెట్టి... ఈ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేయడంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదాపడింది. బీజేపీ సీఎంల  మనీ ల్యాండరింగ్‌ విషయంలో సీబీఐ, ఈడీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపించారు.  

దక్షిణాది ప్రజలు భారతీయులు కాదా?: ఖర్గే
బీజేపీ నేత తరుణ్‌ విజయ్‌ జాతి వివక్ష వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి.  విజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నాయి. దీంతో సభ మూడు సార్లు వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement