జానీ మాస్టర్‌ వివాదంలో అల్లు అర్జున్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత | Producer Ravi Shankar Comments On Allu Arjun Not Involved Jani Master Issue | Sakshi
Sakshi News home page

జానీ మాస్టర్‌ వివాదంలో అల్లు అర్జున్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత

Published Mon, Sep 23 2024 1:52 PM | Last Updated on Mon, Sep 23 2024 6:39 PM

Producer Ravi Shankar Comments On Allu Arjun Not Involved Jani Master Issue

కొరియెగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్‌ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోర్ట్‌ రిమాండ్‌ విధించడంతో జానీని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, ఈ విషయంపై తాజాగా 'పుష్ప' నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీస్‌ రవిశంకర్‌ రియాక్ట్‌ అయ్యారు. జానీమాస్టర్‌ వ్యవహారంలో అల్లు అర్జున్‌, సుకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయని మీడియా వారు ఆయన్ను ప్రశ్నించడంతో క్లారిటీ ఇచ్చారు.

జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్‌ ఉన్నారనే వార్తలను నిర్మాత రవిశంకర్‌ ఖండించారు. 'జానీ మాస్టర్, ఆ యువతి (బాధితురాలు) గొడవలతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదం పూర్తిగా జానీ మాస్టర్, ఆమెకు సంబంధించినది మాత్రమే.  పుష్ప 2 సినిమా ప్రారంభం నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్‌గా ఆమె పనిచేశారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. అక్టోబర్‌ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నాం. ఆరు నెలల క్రితం మేము విడుదల చేసిన లిరికల్ సాంగ్‌లో కూడా ఆమె పేరు ఉటుంది. 

అయితే, జానీ మాస్టర్‌తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునేలోపే ఈ గొడవ తెరపైకి వచ్చింది. షూటింగ్‌ సెట్‌లో అంతర్గతంగా జరిగే విషయాలు అల్లు అర్జున్‌కు తెలీదు. ఎవరైనా విషెస్‌ చెబితే స్పందించడం తప్ప హీరోకు ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో విలువలతో కలిగిన వ్యక్తిగా బన్నీకి గుర్తింపు ఉంది. బన్నీ గురించి  ప్రధాన మీడియా ఇలాంటి వార్తలు రాయడం లేదు. కానీ, కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ వారు  తమ ఉనికి కోసం అల్లు అర్జున్‌పై ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ' అని తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement