సాక్షి, తిరుమల: తిరుమలలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ప్రతినిధులు ఆదివారం సామూహిక ధ్యానం నిర్వహించారు. యోగాగురు పండిట్ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ధ్యానంలో పాల్గొన్నారు. ఇందులో విదేశీయులు కూడా భారతీయ కట్టూబొట్టూ సంప్రదాయంతో హాజరయ్యారు.
రవిశంకర్ సూచనలతో ప్రతినిధులందరూ ఉ చ్ఛ్వా స, నిశ్వాసపై దృష్టి కేంద్రీకరించి ధ్యానంలో లీనమైపోయారు. దేవదేవుని సన్నిధిలో ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేయటం ప్రతి ఒక్కరి అదృష్టంగా భావించాలని పండిట్ రవిశంకర్ అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, అధికారులు సైతం ధ్యానంలో పాల్గొన్నారు. అంతకుముందు తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాలను పండిట్ రవిశంకర్ సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.
హిందూ సంప్రదాయాలకు వేదాలు మూలం
భారతీయ హిందూ సంప్రదాయాలకు వేదాలు మూలమని, అవి సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని యోగా గురు పండిట్ రవిశంకర్ అన్నారు. ఆదివారం ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో రవిశంకర్ మాట్లాడారు. భక్తులకు టీటీడీ కల్పించే సేవలు విశేషంగా ఉన్నాయని కొనియాడారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది.
తిరుమలలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ధ్యానం
Published Mon, Feb 17 2014 3:28 AM | Last Updated on Fri, Nov 9 2018 6:23 PM
Advertisement
Advertisement