
డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ద లయన్ కింగ్‘ ట్రైలర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ చిత్రం వివిధ భాషల్లో త్వరలో రిలీజవుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఈ చిత్రంలోని పలు పాత్రలకు డబ్బింగ్ చెప్పిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను వివిధ భాషలతో పాటు తెలుగులో తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో బొమ్మాళీ అంటూ విలక్షణమైన వాయిస్‌తో ప్రేక్షకులను మెస‍్మరైజ్ చేసిన రవిశంకర్ మరోసారి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు జగపతి బాబు వాయిస్ కూడా విలక్షణంగా వినిపిస్తోంది. అయితే హీరో నానీ వాయిస్ కోసం వెయిట్ చేశామంటూ మరికొంతమంది అభిమానులు నిరాశను వ్యక్తం చేయడం గమనార్హం.
కాగా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో జనం మెచ్చిన, జగమెరిగిన రారాజు, సింబా! ద లయన్ కింగ్ త్వరలోనే ధియేటర్లలో గర్జించడానికి రడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో హీరో నానితోపాటు , సీనియర్ నటుడు జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీ ఈ సినిమాలో ప్రముఖ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రానికి ఆయా భాషల్లో టాప్ హీరోలు, కమెడియన్‌లు వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment