సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌పోల్ సమాచారంతో సీబీఐ విశాఖకు వచ్చిందని చెప్పుకొచ్చారు. సీబీఐ పిలిస్తేనే పోలీసులు అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. ఇదే సమయంలో తమపై ఎలాంటి పొలిటికల్ ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.
కాగా, రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఈ డ్రగ్స్ కేసు అంతా సీబీఐ పర్యవేక్షిస్తోంది. సీబీఐ నుంచి మాకు కాల్ వచ్చింది. వారు డాగ్ స్క్వాడ్ కావాలని మమ్మల్ని అడిగారు. తర్వాత డాగ్ స్క్వాడ్ వద్దని చెప్పారు. కేవలం డాగ్ స్క్వాడ్ కోసమే స్థానిక పోలీసులు వెళ్లారు. సీబీఐ విన్నపం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. విశాఖ పోర్టు మా పరిధిలో ఉండదు. మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాం. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. ఏపీ పోలీసులపై సీబీఐ ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
మా పరిధిలోలేని ప్రైవేటు పోర్టుకు కస్టమ్స్ అధికారులు పిలిస్తేనే వెళ్లాం. వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం మంచిది కాదు. కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారువిశాఖ డ్రగ్స్ వ్యవహారాన్ని సీబీఐ చూస్తోంది. విశాఖ చాలా సేఫ్ సిటి. లోకల్ అధికారుల వల్ల లేటు అయ్యిందని చెప్పడం టెక్నికల్ టెర్మినాలజీ మాత్రమే. మేము (NDPS) ఎన్డీపీఎస్ యాక్ట్ సాయంతో డ్రగ్స్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేస్తున్నాం. గత ఐదేళ్ల కాలంలో డ్రగ్స్‌ను కట్టడి చేస్తున్నాం. గంజా స్మగ్లింగ్‌ను అడ్డుకున్నాం’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment