
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీకి కరీంనగర్ జిల్లా జన్మను, పునర్జన్మను ఇచ్చిందని ఆపధర్మ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యాంచారు. కేసీఆర్ చొప్పదండి అల్లుడని.. అక్కడ మరోసారి గెలిచి ఆయనకు కానుక ఇవ్వాల్సిన బాధ్యత అక్కడి ప్రజలపై ఉందని ఆయన అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో చొప్పదండి నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల్లో చొప్పదండి అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. శోభకు ఓపిక లేక పార్టీ మారారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్ అభ్యర్థి రవిశంకర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు వచ్చిందని.. ఈ విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తించకపోవడం బాధకరమన్నారు. కాంగ్రెస్ నాయకులు కోదండరాంను కరివేపాకులా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. మహాకూటమికి ఓటు వేస్తే సొంత రాష్ట్రంలోనే పరాయి వాళ్లం అవుతామని.. పొరపాటున కూడా ఆ పార్టీలకు ఓటు వెయ్యవద్దని కోరారు. సీట్లు కూడా సరిగ్గా ఖరారు చేసుకోలేని వాళ్లు రేపు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment