
సాక్షి, రాజన్న సిరిసిల్లా : 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో నాడు కరెంట్ ఉంటే వార్తని, కానీ నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్తని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా, గంభీరావుపేటలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపడానికి దేశంలోని పైల్వాన్లంతా ఏకమై వస్తున్నారని, అది సాధ్యమేనా? అని ప్రశ్నించారు. సోనియా గాంధీని తిట్టిన చంద్రబాబునాయుడుని అలయ్ బలయ్ చేసుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్నవాళ్లకు నాలుగేళ్ల పాలనతో కేసీఆర్ దుమ్ము దులుపుతున్నారని, దేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని తెలిపారు.
కాంగ్రెసోళ్లు దేశ ముదుర్లని, ప్రజలంతా ఆలోచించాలన్నారు. నాడు కాంగ్రెస్ పాలనలో విత్తనాలు పోలీస్ స్టేషన్‌లో పెట్టి రైతులకిచ్చారని గుర్తు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా.. రైతు బంధు, భీమాతో రైతు కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. ఆరునెలల్లో నర్మాల చెరువును మిడ్‌మానేరు నీటితో నింపుతామని, తెలంగాణ రాకపోతే.. కేసీఆర్ సీఎం కాకపోతే సిరిసిల్లా జిల్లా అయ్యేదా అని ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితుల ద్వారా పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment