రీజినల్‌ మీట్‌ పోటీల సందడి | reginal meet at choppadandi | Sakshi
Sakshi News home page

రీజినల్‌ మీట్‌ పోటీల సందడి

Published Wed, Aug 24 2016 10:43 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

reginal meet at choppadandi

చొప్పదండి : చొప్పదండిలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆటలపోటీలతో సందడి వాతావరణం నెలకొంది. రీజినల్‌ స్థాయి చెస్, యోగా పోటీలకు నాలుగు రాష్ట్రాల నుంచి హాజరైన రెండువందలకు పైగా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యేందుకు కుస్తీ పడుతున్నారు. బాలురు, బాలికల విభాగంలో చెస్, యోగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు హర్యానాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్‌ మంగతాయారు తెలిపారు. 
 
29న జిల్లా స్థాయి త్రోబాల్‌ టోర్నమెంట్‌ 
ౖయెటింక్లయిన్‌కాలనీ : ౖయెటింక్లయిన్‌కాలనీ సీఈఆర్‌ క్లబ్‌లో సోమవారం జిల్లా స్థాయి త్రోబాల్‌ టోర్నమెంట్, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు ఐలి శ్రీనివాస్, పాశం ఓదెలు యాదవ్‌ తెలిపారు. అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులు ఎస్‌జీఎఫ్‌ఐ ఫామ్‌తో రావాలని సూచించారు. టోర్నమెంట్‌లో పాల్గొనే పాఠశాలల జట్లు ఒకరోజు ముందుగా 9849484631నెంబరులో సమాచారం ఇవ్వాలని కోరారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement