Jaswant
-
తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ స్వీప్
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆ రాష్ట్ర ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ములేపారు. అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ, ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో సనపల అనిరుధ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జశ్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులతో భళా అనిపించారు. ఇంజనీరింగ్ విభాగంలో 2, 3, 5, 6, 8, 9, 10 ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కాయి. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలోనూ 2, 4, 5, 7, 8 ర్యాంకులు ఎగరేసుకుపోయారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. కాగా ఇంజనీరింగ్ ర్యాంకర్లందరూ ఐఐటీల్లో చేరతామని, మెడికల్ విభాగం ర్యాంకర్లంతా వైద్య వృత్తిలో స్థిరపడతామని వెల్లడించారు. విజేతల అభిప్రాయాలు వైద్య రంగంలో ఉన్నతవిద్యనభ్యసిస్తా.. మాది చీరాల. నాన్న నాసిక సుధాకర్‌బాబు, అమ్మ శ్రీదేవి మగ్గం నేస్తారు. విజయవాడలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్మిడియెట్ చదివాను. వైద్య రంగంలో ఉన్నత విద్యనభ్యసించడమే నా లక్ష్యం. – నాసిక వెంకటతేజ, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కార్డియాలజిస్ట్ లేదా న్యూరాలజిస్టునవుతా.. మాది తెనాలి. నాకు ఇంటర్ బైపీసీలో 983 మార్కులు వచ్చాయి. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా ఆకాంక్ష. ఇప్పటికే నీట్ రాశాను. ఎంబీబీఎస్ చేసి ఆ తర్వాత కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా స్థిరపడాలనేదే నా కోరిక. – దుర్గెంపూడి కార్తికేయరెడ్డి, నాలుగో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) వైద్య రంగంలో స్థిరపడతా.. మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాకు నీట్‌లోనూ మంచి ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉంది. వైద్య రంగంలో స్థిరపడాలనేది నా కోరిక. – బోర వరుణ్ చక్రవర్తి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) మంచి వైద్య కళాశాలలో మెడిసిన్ చేస్తా.. మాది నెల్లూరు. అమ్మానాన్న హారతి, శంకర్ వైద్యులుగా పనిచేస్తున్నారు. మంచి మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదవడమే నా లక్ష్యం. – హర్షల్సాయి, ఏడో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కష్టపడి చదివా.. మాది గుంటూరులోని ఏటీ అగ్రహారం. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను. – సాయి చిది్వలాస్రెడ్డి, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (అగ్రి అండ్ మెడికల్ విభాగం) కంప్యూటర్స్ సైన్స్ చదువుతా.. మాది గుంటూరు. నాన్న శ్రీనివాసరెడ్డి రైతు. ఇంటర్ ఎంపీసీలో 971 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. – యక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి, సెకండ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించడమే లక్ష్యం మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ. ఇంటర్మిడియెట్ ఎంపీసీలో 983 మార్కులు సాధించాను. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఓపెన్ కేటగిరీలో 263వ ర్యాంక్ వచ్చింది. వచ్చే నెలలో జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఇందులో మంచి ర్యాంక్ సాధించడమే నా లక్ష్యం. – చల్లా ఉమేష్ వరుణ్, థర్డ్ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) సివిల్స్ సాధించి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. ఇటీవల జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 97వ ర్యాంకు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. తర్వాత సివిల్స్ రాసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – పొన్నతోట ప్రమోద్ కుమార్‌రెడ్డి, ఐదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో చేరతా.. మాది విశాఖపట్నం జిల్లా గాజువాక. నాన్న బిజినెస్‌లో ఉండగా అమ్మ ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. ఇంటర్ ఎంపీసీలో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియాలో 110వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. – మరడాన ధీరజ్ కుమార్, ఆరో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చదువుతా.. మాది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి. నాన్న గణేష్ వ్యాపారి, అమ్మ జ్యోతి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 729వ ర్యాంక్ సాధించాను. వచ్చే నెలలో నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌లో చేరాలనేదే నా లక్ష్యం. – బోయిన సంజన, 8వ ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) కంప్యూటర్ ఇంజనీర్‌నవుతా.. మాది నంద్యాల. ఇంటర్ ఎంపీసీలో 956 మార్కులు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంకు సాధించి మంచి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. కంప్యూటర్ ఇంజనీర్‌ను కావడమే లక్ష్యం. – ప్రిన్స్ బ్రన్హంరెడ్డి, తొమ్మిదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) అడ్వాన్స్‌లోనూ ర్యాంక్ సాధిస్తా.. మాది విజయనగరం జిల్లా గుర్ల. నాన్న అప్పలనాయుడు రైల్వే కానిస్టేబుల్, అమ్మ ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జేఈఈ మెయిన్‌లో 99 శాతం పర్సంటైల్ సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో చేరతా. – మీసాల ప్రణతి శ్రీజ, పదో ర్యాంకర్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్ విభాగం) -
వైవిధ్యం.. వినోదం...
జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎర్రర్ 500’. సాందీప్ మైత్రేయ.ఎన్ దర్శకత్వంలో యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా దర్శకుడు వీఎన్ ఆదిత్య, హీరో ఆకాష్ పూరి పాల్గొన్నారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ–‘‘ట్రైలర్ బ్రిలియంట్‌గా ఉంది. అలాగే ‘ఎర్రర్ 500’ అనేది జెస్సీకి యాప్ట్ టైటిల్. ఈ సినిమా రిలీజ్ ప్లాన్ గురించి సాందీప్‌ని అడిగినప్పుడు సంతోషం సురేష్‌గారు చూశారని చెప్పారు. వెంటనే సినిమా సేఫ్ హ్యాండ్స్‌లో ఉందని చెప్పాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఫణి కల్యాణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు జెస్సీ. ‘‘ట్రైలర్లానే సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. జెస్సీ చాలా అంకితభావంతో ఈ సినిమా చేశాడు’’ అన్నారు సాందీప్. -
టీజర్ బాగుంది
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్ 500’ టీజర్ బాగుంది. యూనిట్ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో సందీప్ మైత్రేయ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రర్ 500’. యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. జస్వంత్ మాట్లాడుతూ– ‘‘ఎర్రర్ 500’ అందరికీ కనెక్ట్ అయ్యే కథ. నన్ను హీరోగా పరిచయం చేసిన బాలరెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ‘బిగ్ బాస్’ ఫేం జస్వంత్‌ని హీరోగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సందీప్. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్ శ్రీరామ్– ప్రశాంత్ మన్నె, సంగీతం: ఫణి కల్యాణ్. -
ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడి మృతి
మల్యాల(చొప్పదండి): మండలంలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బండారి గంగాదర్ మూడో కుమారుడు బండారి జశ్వంత్(10)మండల కేంద్రంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం జశ్వంత్ ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లలో, పరిసరాల్లో వెతికారు. స్నేహితులను అడిగినా చెప్పకపోవడంతో రాత్రి వరకు వెతికారు. గ్రామంలోని పిల్లలు తరచూ ఈతకు వెళ్లే బావి వద్దకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులకు తెలియడంతో సోమవారం తెల్లవారుజామున స్థానికులు బావిలో వెతకగా శవం లభ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు బావిలో పడినట్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలం రవి తెలిపారు. -
చారుశీల ఏం చేసింది?
రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘చారుశీల’. శ్రీనివాస్ ఉయ్యూరు దర్శకుడు. కొండపల్లి సమర్పణలో జోత్స్న ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు వి.సాగర్, సిద్ధిరెడ్డి, జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. చూస్తున్నంత సేపూ తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠకు లోనవుతారు. చారుశీలగా రష్మీ నటనకు అవార్డులు రావడం ఖాయం. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మంచి చాయిస్ ఈ చిత్రం. బ్రహ్మానందం, మెల్కోటి, జబర్దస్త్ టీం మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. మాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కుమార్ మల్లారపు, సంగీతం: సుమన్ జూపూడి, కథ-కథనం- ఛాయాగ్రహణం- దర్శకత్వం: శ్రీనివాస్ ఉయ్యూరు. -
మూడు గ్లాసులు.. ఆరు సీసాలు
⇒ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు వ్యాపారం ⇒రోజుకు 50 మందికి తగ్గకుండా అస్వస్థత ⇒సంగెంలో ఒకరి మృతి, నలుగురు సీరియస్ ⇒ఆస్పత్రిలోనే మరో 30 మంది బాధితులు ⇒సహజంగా మారిన ‘కల్తీ’ మరణాలు ⇒నిషేధిత మత్తు మందులతో కల్లు తయారీ ⇒కళ్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ అధికారులు ధనదాహం ఒళ్లు విరిస్తే అక్రమ వ్యాపారం ‘కట్ట’లు తెంచుకుంటుంది. కల్తీ కల్లు ‘విషం’ చిమ్ముతున్నా ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. కల్తీ కల్లు తయారీదారులు, అమ్మకందారులపై నామమాత్రపు కేసులు నమోదు చేస్తూ పరోక్షంగా వారికి అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దోషులపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. కల్తీ కల్లు తయారీ ‘మూడు గ్లాసులు.. ఆరు సీసాలు’గా వర్ధిల్లుతోంది. అందుకు బీర్కూరు మండలం సంగెంలో తాజాగా జరిగిన విషాద సంఘటనే నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కల్తీ కల్లు మహమ్మారి బడుగుల జీవితాలలో చిచ్చు పెడుతోంది. ఏటా కల్తీ కల్లు మరణాలు పెరుగుతున్నా చర్యలు అంతంత మాత్రమే. తీవ్ర సంఘటనలు జరిగితే తప్ప ఆబ్కారీ అధికారులు కదలడం లేదు. బీర్కూరు మండలంలో కల్తీ కల్లుకు బానిసలుగా మారి గతంలో పదులసంఖ్యలో ప్రజలు చనిపోయిన సంఘటన మరవకముందే అదే మండలంలోని సంగెం గ్రామంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి పాల్త్య మోతీరాం (60) అనే వృద్ధుడు మృతి చెందగా, 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఐశ్వర్య (5), జశ్వంత్ (6), సరోజ (5) అనే ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. నమూనాలను సేకరిం చి కల్తీ కల్లు మరణాలను మొక్కుబడి గా ‘మమ’ అనిపించడం పరిపాటిగా మారిన అబ్కారీ శాఖ నిర్లక్ష్యంతో మ రో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎం దుకు స్పందించడం లేదో అర్థం కావ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు బుట్ట దాఖలు ‘కల్తీ’కల్లు తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని నిబంధనలున్నా అవి బుట్టదాఖలవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాల యాల పరిధిలో ఇలాంటి సంఘటన లు నిత్యకృత్యంగా మారాయి. తాజా గా సంగెంలో ఒకరిని కాటేసిన సంఘటన కలకలం రేపుతోంది. 2012లో ఒక్క బీర్కూరు మండలంలోనే 15 రోజులలో 22 మంది చనిపోగా, ఆ తర్వాత నిజామాబాద్ నగరంలోను కల్తీ కల్లు పలువురిని బలిగొంది. బీర్కూరులో అప్పటి కలెక్టర్ డిపోలను రద్దు చేసి డిపో నిర్వహకునిడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు షరా‘మామూలు’గా తీసుకున్న అబ్కారీ శాఖ అధికారులు కల్లు వ్యాపారానికి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొద్దిరోజుల కే బీర్కూరు, బాన్సువాడ డిపో పరిధిలో కల్లు తాగిన పలువురు పిచ్చివాళ్లుగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీ యాంశం అయ్యింది. ‘‘సార్ కల్తీ కల్లు తో మా ప్రాంత జనం పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు...దయచేసి మీరైనా స్పందించి కల్తీకల్లును అరికట్టండి..డిపోలను మళ్లీ మూసెయ్యండి’’ అం టూ స్వాతి అనే యువతి ఈ ఏడాది జనవరి 16న పోలీసు వెబ్సైట్లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనూ కలెక్టర్ రొనాల్డ్ రోస్ సైతం కల్తీ కల్లుపై పోరాడాలని మహిళలకు పిలుపునిచ్చారు. అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇష్టారాజ్యంగా వెలుస్తున్న కల్లు దుకాణాలు పేద ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. జిల్లాలో సగటున రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు ‘‘కల్తీ కల్లు తయారీని ఆపండి మహాప్రభో’’ అంటూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలూ అధికారులను మాత్రం కది లించడం లేదు. హానికర అవశేషాలతో అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ కల్లు వ్యాపారానికి హానికర అవశేషాలు డైజో, క్లోరోఫామ్లు, క్లోరల్‌హైడ్రేట్, అల్ఫాజోలం ముడి పదార్థాలు. డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్, క్లో రోఫాం (మత్తు కోసం), చాక్రిన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కో సం), కుంకుడు కాయల రసం (నురు గు కోసం) వాడతారు. ఏళ్ల తర బడి వీటితో కల్తీ కల్లు తయారీ విచ్చలవి డిగా సాగుతున్నా, అది తాగినవారు మరణిస్తున్నా, అస్వస్థతకు గురి అవుతున్నా నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది. జిల్లాలో ఉన్న ఈత, తాటి చెట్లకు, మార్కెట్లో లభ్యమవుతున్న కల్లుకు ఏమాత్రం పొంతన లేదని, లక్ష ల లీటర్ల కల్తీ కల్లు తయారవుతుందనేది బహిరంగ రహస్యం. సామాన్యుల శరీరాలను పీల్చి పిప్పి చేస్తున్నా, కల్లు తాగినవారు ఎముకల గూడులా త యారవుతున్నా, నిరుపేదల కుటుంబాలలో మత్యు ఘంటికలు మోగుతున్నా అధికారులు చలించటం లేదు. గీత వృత్తితో సంబంధం లేనివారే ‘కల్లు మాఫియా’గా అవతారమెత్తడంతో అ క్ర మార్జనే తప్ప, పేదల ప్రాణాలు పట్టింపు లేకుండా పోతోంది. ఇప్ప టికైనా సంబంధిత అధికారులు కదు లుతారో లేదో చూడాలి. -
వామ్మో...భయపెడతారట
సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, జస్వంత్ హీరోలుగా జస్వంత్ నిర్మిస్తున్న ‘వామ్మో’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎస్.గోపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, బ్రహ్మానందం క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ తాను తీసిన 30 సినిమాల్లోకెల్లా విభిన్నంగా ఉండే సినిమా ఇదేననీ, వినోదంతో పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండే హారర్ చిత్రమిదనీ సాగర్ చెప్పారు. కమెడియన్‌గా చేస్తూనే మంచి అవకాశం వస్తే.. హీరోగా నటిస్తున్నాననీ, సాగర్ లాంటి మంచి దర్శకునితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, సుధీర్, శ్రీను, మహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: వి.నాగిరెడ్డి, సంగీతం: కీరవాణి, కోటి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతం: సాయికార్తీక్.