మూడు గ్లాసులు.. ఆరు సీసాలు | adulterated liquor kills the peoples | Sakshi
Sakshi News home page

మూడు గ్లాసులు.. ఆరు సీసాలు

Published Sat, Dec 13 2014 3:13 AM | Last Updated on Mon, Aug 20 2018 2:21 PM

మూడు గ్లాసులు.. ఆరు సీసాలు - Sakshi

మూడు గ్లాసులు.. ఆరు సీసాలు

ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు వ్యాపారం
రోజుకు 50 మందికి తగ్గకుండా అస్వస్థత
సంగెంలో ఒకరి మృతి, నలుగురు సీరియస్
ఆస్పత్రిలోనే మరో 30 మంది బాధితులు
సహజంగా మారిన ‘కల్తీ’ మరణాలు
నిషేధిత మత్తు మందులతో కల్లు తయారీ
కళ్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ అధికారులు

 
ధనదాహం ఒళ్లు విరిస్తే అక్రమ వ్యాపారం ‘కట్ట’లు తెంచుకుంటుంది. కల్తీ కల్లు ‘విషం’ చిమ్ముతున్నా ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం కళ్లు తెరవడం లేదు. కల్తీ కల్లు తయారీదారులు, అమ్మకందారులపై నామమాత్రపు కేసులు నమోదు చేస్తూ పరోక్షంగా వారికి అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దోషులపై పీడీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలనే నిబంధనలు ఉన్నా అమలు కావడం లేదు. కల్తీ కల్లు తయారీ ‘మూడు గ్లాసులు.. ఆరు సీసాలు’గా వర్ధిల్లుతోంది. అందుకు బీర్కూరు మండలం సంగెంలో తాజాగా జరిగిన విషాద సంఘటనే నిదర్శనం.
 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కల్తీ కల్లు మహమ్మారి బడుగుల జీవితాలలో చిచ్చు పెడుతోంది. ఏటా కల్తీ కల్లు మరణాలు పెరుగుతున్నా చర్యలు అంతంత మాత్రమే. తీవ్ర సంఘటనలు జరిగితే తప్ప ఆబ్కారీ అధికారులు కదలడం లేదు. బీర్కూరు మండలంలో కల్తీ కల్లుకు బానిసలుగా మారి గతంలో పదులసంఖ్యలో ప్రజలు చనిపోయిన సంఘటన మరవకముందే అదే మండలంలోని సంగెం గ్రామంలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి పాల్త్య మోతీరాం (60) అనే  వృద్ధుడు మృతి చెందగా, 30 మంది అస్వస్థతకు గురయ్యారు.

అందులో ఐశ్వర్య (5), జశ్వంత్ (6), సరోజ (5) అనే ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. నమూనాలను సేకరిం చి కల్తీ కల్లు మరణాలను మొక్కుబడి  గా ‘మమ’ అనిపించడం పరిపాటిగా మారిన అబ్కారీ శాఖ నిర్లక్ష్యంతో మ రో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు ఎం దుకు స్పందించడం లేదో అర్థం కావ డం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు బుట్ట దాఖలు
‘కల్తీ’కల్లు తయారీదారులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని నిబంధనలున్నా అవి బుట్టదాఖలవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాల యాల పరిధిలో ఇలాంటి సంఘటన లు నిత్యకృత్యంగా మారాయి. తాజా    గా సంగెంలో ఒకరిని కాటేసిన సంఘటన కలకలం రేపుతోంది. 2012లో ఒక్క బీర్కూరు మండలంలోనే 15 రోజులలో 22 మంది చనిపోగా, ఆ తర్వాత నిజామాబాద్ నగరంలోను కల్తీ కల్లు పలువురిని బలిగొంది. బీర్కూరులో అప్పటి కలెక్టర్ డిపోలను రద్దు చేసి డిపో నిర్వహకునిడిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు షరా‘మామూలు’గా తీసుకున్న అబ్కారీ శాఖ అధికారులు కల్లు వ్యాపారానికి మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కొద్దిరోజుల  కే బీర్కూరు, బాన్సువాడ డిపో పరిధిలో కల్లు తాగిన పలువురు పిచ్చివాళ్లుగా ప్రవర్తించడం అప్పట్లో చర్చనీ యాంశం అయ్యింది. ‘‘సార్ కల్తీ కల్లు  తో మా ప్రాంత జనం పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు...దయచేసి మీరైనా స్పందించి కల్తీకల్లును అరికట్టండి..డిపోలను మళ్లీ మూసెయ్యండి’’ అం టూ స్వాతి అనే యువతి ఈ ఏడాది జనవరి 16న పోలీసు వెబ్‌సైట్‌లో ఎస్‌పీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలోనూ కలెక్టర్ రొనాల్డ్ రోస్ సైతం కల్తీ కల్లుపై పోరాడాలని మహిళలకు పిలుపునిచ్చారు. అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇష్టారాజ్యంగా వెలుస్తున్న కల్లు దుకాణాలు పేద ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్నాయి. జిల్లాలో సగటున రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు ‘‘కల్తీ కల్లు తయారీని ఆపండి మహాప్రభో’’ అంటూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలూ అధికారులను మాత్రం కది లించడం లేదు.
 
హానికర అవశేషాలతో
అధికారుల అండతో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ కల్లు వ్యాపారానికి హానికర అవశేషాలు డైజో, క్లోరోఫామ్‌లు, క్లోరల్‌హైడ్రేట్, అల్ఫాజోలం ముడి పదార్థాలు.  డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్, క్లో రోఫాం (మత్తు కోసం), చాక్రిన్ (రుచి కోసం), తెల్లపౌడర్ (చిక్కదనం కో  సం), కుంకుడు కాయల రసం (నురు గు కోసం) వాడతారు. ఏళ్ల తర బడి వీటితో కల్తీ కల్లు తయారీ విచ్చలవి  డిగా సాగుతున్నా, అది తాగినవారు మరణిస్తున్నా, అస్వస్థతకు గురి అవుతున్నా నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది.

జిల్లాలో ఉన్న ఈత, తాటి చెట్లకు, మార్కెట్లో లభ్యమవుతున్న కల్లుకు ఏమాత్రం పొంతన లేదని, లక్ష ల లీటర్ల కల్తీ కల్లు తయారవుతుందనేది బహిరంగ రహస్యం. సామాన్యుల శరీరాలను పీల్చి పిప్పి చేస్తున్నా, కల్లు తాగినవారు ఎముకల గూడులా త  యారవుతున్నా, నిరుపేదల కుటుంబాలలో మత్యు ఘంటికలు మోగుతున్నా అధికారులు చలించటం లేదు. గీత వృత్తితో సంబంధం లేనివారే ‘కల్లు మాఫియా’గా అవతారమెత్తడంతో అ క్ర మార్జనే తప్ప, పేదల ప్రాణాలు పట్టింపు లేకుండా పోతోంది. ఇప్ప టికైనా సంబంధిత అధికారులు కదు లుతారో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement