‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి. ‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు.
వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు. స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి. ‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా. ‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె.
ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’ అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి. దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది.
‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా.
‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు. పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి.
‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా. ‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయి మాట స్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు.
‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది. ‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు.
భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది.
రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది. ‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా.
లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు. ఆ షాక్‌లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు.
వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది.
చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే.
ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు. తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా.
ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది. చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ.
‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి. ‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి.
‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ!‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు.
పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి.
‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి. కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది.
సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది. ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ.
‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది. ‘అప్పా! నెలలు నిండిపోయినాయంట.
రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ.
తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు. ‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది.
నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు. కర్రసాయం లేకండా నడవలేడు.
ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’ ‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు.
వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల. అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది.
తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి. ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది.
‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు. పోయీ మెల్లంగా తీస్కపోరా! ‘ఈ బాయికి దాహం జాస్తి! ఎబ్బుడు తీర్తాదో ఏమో!’ హఠాత్తుగా అంది వెంకటలక్ష్మి.
‘బావికి దాహం ఏందే ఎర్రి ఎంకటమ్మా’ నవ్వేసింది రోజా. ‘అసలు ఈ బావే ఎంతమంది దాహం తీర్చిందో.. ఎన్ని పంటలకు నీళ్లిచ్చిందో కదా!’ బావి చుట్టూ ఉన్న పచ్చటి పంట పొలాలను చూస్తూ అంది. అది చాలా పెద్ద దిగుడు బావి. దాని లోతు ఎన్ని మట్లో ఎవరికీ తెలీదు. పేరే పెద్ద బావి! నిండు వేసవిలో కూడా అందులో నీళ్లు తగ్గవు. వేసిన ప్రతి పంటా సిరుల పంటే! ఒకప్పుడు.. తాతల కాలంలో.. ఏతం తొక్కడం, కపిల బానలతో బావిలో నుండి నీళ్లు తోడి పొలాలకు పారించే వాళ్ళట. ఇప్పుడు తండ్రి హయాంలో మోటర్లు బిగించారు.
స్విచ్ వేయడం ఆలస్యం నీళ్లు పైపుల నుండి దూకుతాయి. కరెంటు కోతే తప్ప నీళ్ల కొరత ఎప్పుడూ లేదు. ‘పద్దన అమ్మ నన్ను ‘ఎంకటా’ అని పిలిస్తే నువ్వేమంటివీ?’ నడుం మీద రెండు చేతులు పెట్టుకొని గంభీరంగా చూస్తూ నిలదీసింది వెంకటలక్ష్మి.‘ఏమన్నానబ్బా?’ గుర్తు తెచ్చుకుంది రోజా.‘ఎంకటి వుండబట్టిగానీ లేపోతే నేనేం చేసుందును? మీ అప్పను చూసేదానికి వచ్చేవాల్లు .. పోయేవాల్లు.. ఇల్లంతా తిరనాల మాదిరి ఉండె. ఇంట్లో పని.. వంట పని మొత్తమంతా ఆ బిడ్డే సమాళించింది.’అమ్మ మాటలకు తను చిరాకు పడింది వెంకటలక్ష్మి వేపు మెచ్చుకోలుగా చూస్తూనే! ‘ఎంకటి ఏంది మా సంకటి మాదిరి.
దాని పేరు వెంకటలక్ష్మి. మా వెంకటరెడ్డి సారు దానికి ఆ పేరు పెట్టి రిజిస్టర్లో రాసినారు తెల్సా!’ ‘ఆ! ఆ! తెల్సులే! బడిలో చేరిన చానామంది పిల్లోల్లకి ఆ పేరే పెట్టినాడంట కదా ఆ ఎంకట్రెడ్డి సారు? ఆడపిలకాయలకు ఎంకటలక్ష్మి.. మగ పిలకాయలకు ఎంకటేసూ అనీ! ఆ యప్పకు ఆయన పేరు అంటే ఇస్టమో లేపోతే ఆ ఎంకటేస్పర సామంటే భకితో మల్ల!’ అమ్మ నవ్వుతూ అంది.
‘అది నిజమే! అయినా నేను తప్ప దీన్ని ‘వెంకటలక్ష్మి’ అని ఎవరూ పిలవలా! ఆఖరికి పేరు పెట్టిన మా సారు కూడా! అందరూ ఎంకటా.. ఎంకటమ్మా అనేవాళ్ళే!’ కినుకగా అంటున్న తన మాటలకు అందరూ నవ్వేసుకున్నారు. ఇప్పుడు నవ్వొచ్చేసింది ఇద్దరికీ. ‘సారీ బా! అలవాట్లో పొరపాటు. అవునూ.. మన వెంకట రెడ్డి సారు ఎలా ఉన్నారు? బాగున్నారా? తిరగలాడుతారా?’ ఆసక్తిగా అడిగింది రోజా. ‘ఆహా! బొంగరం మాదిరి. మొన్నో దినం మీ అప్పని చూసేదానికి కూడా వొచ్చినారు.
పక్క పల్లెలోనే సారు ఉండేది.’ ‘అవునా! ఒకసారి పోయి చూసి వద్దామే సారును! మనకు అక్షరాభ్యాసం చేసిన గురువు కదా!’ ‘ఎబ్బుడొచ్చినా పట్టు పట్టుమని పోడమే గాని నాలుగు దినాలుండినావా ఎబ్బుడన్నా? ఉడుకు నీల్లు కాల్ల మింద పోసుకొని వొచ్చినట్టు వొస్తావు. ఇబ్బుటికో మాపటేలకో మీ ఇంటాయన పోన్ చేస్తే తెల్లారే బస్సెక్కెయ్యవూ?’ నవ్వింది వెంకటలక్ష్మి. ‘లేదులేవే! పద్దినాలు రానని చెప్పొచ్చినాలే! అప్పను చూస్తేనే బాధగా వుందే! పెద్దపులి మాదిరి ఉండేవాడు.. ఇప్పుడు ఇట్లా మంచాన పడి ఉంటే చూడలేకపోతున్నా!’ రోజా కళ్ళు చెమర్చాయి. ‘సావాల్సింది’ వెంకటలక్ష్మి మాట పదునుకు అదిరిపడింది రోజా.
‘ఏమంటివే?’ రోజా గొంతులో కోపం కళ్ళల్లో ఎరుపును నింపింది. ‘ఆ! డాక్టర్ చెప్పిండ్లా! బీపీ తలక్కొడితే సానామంది గుండాగి సత్తారంట కదా! మీ అప్ప అదృస్టం.. కాలు సెయ్యి పడిపోయినా ప్రానంతో వుండాడు కదా మనిసి’ వెంకటలక్ష్మి మాటల్లో అమాయకతకు రోజా లజ్జపడింది తన తొందరపాటు కోపానికి. ‘అవును అమ్మ అయిదోతనమే అప్పను కాపాడిందన్నారు అందరూ! కానీ ఇంటికి, పొలానికి, పట్నానికి తిరుగుతూ ఉండే కాలు.. అడుగు వేయలేని ఇప్పటి పరిస్థితికి.. హూంకరింపులతోనే దడిపించే నోరు.. వంకర పోయిమాటస్పష్టంగా పలకలేని నిస్సహాయతకు అప్ప ఎంత నరకయాతన అనుభవిస్తున్నాడో..’ అనుకుంటుంటే కడుపులో దేవినట్లైంది రోజాకు.
‘వెంకటలక్ష్మి! మా అప్పకు మీ అప్ప చేసే సేవ.. నువ్వు అమ్మకు అన్ని విధాలా సహాయంగా ఉండటం.. నిజంగా మీ ఇద్దరికీ చాలా థాంక్సే! మీ రుణం తీర్చలేనిది’ రోజా మనస్ఫూర్తిగా అంది వెంకటలక్ష్మి చేయి తీసుకుని ఆప్యాయంగా నొక్కుతూ. ‘అయ్యో! అదేంమాట? అమ్మ సేతి కూడు తిని బతికే మాకు తాంక్స్ ఎందుకు? అమ్మ మల్లిపూలు కోసుకు రమ్మనింది. కోద్దాం రా!’ అంటూ వెంకటలక్ష్మి మల్లెచెట్టు వైపు నడిచింది.
‘అమ్మకీ దొంతు మల్లిపూలంటే సానా ఇస్టం!’ పంటల నాట్లు, కోతలప్పుడు, చెరుకు గానుగలాడేనప్పుడు తండ్రి ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడు. భోజనం చేయడానికి.. కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడే ఓ చిన్న గది కట్టించాడు.. ఇదివరకు ఉన్న పాకను పీకేయించి. రోజా మెల్లగా గది తలుపు తీసి లోపలికి వెళ్ళబోయి ఆగిపోయింది. ఆమె చూపులు క్షణం పాటు గదిని పరిశీలనగా చూసి చికిలించుకుపోయాయి. వెంటనే తలుపు మూసేసి మల్లెచెట్టు వైపు నడిచింది. మల్లెపొద కింద కూర్చుని వెంకటలక్ష్మి ఏడుస్తోంది. రోజా గాభరాగా వెళ్లి పక్కన కూర్చుని వెంకటలక్ష్మి భుజం చుట్టూ చెయ్యేసి ‘ఏంటిది వెంకటలక్ష్మి! ఊర్కో!’ అంది.
‘ఈ బాయికి ఎంతమంది ఉసుర్లు తీస్కొన్నా దాహం తీరలే! కడాకు నా రాముడ్ని కూడా..’ వెక్కివెక్కి ఏడుస్తున్న వెంకటలక్ష్మిని ఓదార్చడం రోజా వల్ల కాలేదు. ‘పోయినోళ్లు పుణ్యాత్ములు! ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటారు. రాముడు ఎక్కడికి పోతాడు? నీ కడుపులో పెరుగుతున్నాడు కదా! బాధపడకు వెంకటలక్ష్మీ! బిడ్డ కోసమన్నా నువ్వు మనసు నిబ్బరం చేసుకోవాలి’ ఓదార్పుగా అంది రోజా. ‘అవును మా! నా బిడ్డ కోసమే బతికుండా. లేపోతే రాముడ్తో పాటే పొయుండనా?’ ఏడుస్తూనే ఉంది వెంకటలక్ష్మి. బావి దగ్గర బురదలో జారి.. బావిలో పడబోతున్న తండ్రిని లాగి పడేసి తను బావిలోకి జారిపోయాడని చెప్పారు.
ఆ షాక్‌లో.. హై బీపీతో అప్పకు పక్షవాతం వచ్చింది. వెంకటలక్ష్మి అరుపులకు.. కాస్త దూరంగా పొలాల్లో పనులు చేసుకుంటున్న వాళ్లు వచ్చి అప్పను ఇంటికి తీసుకుపోయే హడావిడిలో పడ్డారు. కానీ నీళ్లలో పడ్డ రామున్ని గుర్తించలేదు. వెంకటలక్ష్మి భయంతో, దుఃఖంతో సొమ్మసిల్లి పడిపోయింది.తనకు తెలివి వచ్చేసరికి రాముడు వాకిట్లో దీపం ముందు పడుకోబెట్టబడి ఉన్నాడు. ఆమె దుఃఖ సముద్రమే అయింది. ఇప్పటికీ విచారం, విషాదం నిండిన దుఃఖపు అలలు ఎగిసి పడుతూనే ఉన్నాయి. కడుపులో బిడ్డ కోసం గుండెలవిసే దుఃఖానికి కంటి రెప్పల చెలియలికట్ట వేసుకొని భారంగా శరీరాన్ని, మనసును మోస్తోంది.
చిన్నప్పుడు తాము ఈ బావి దగ్గర ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళు? ఎండాకాలం సెలవుల్లో మగ పిల్లలంతా ఈ బావిలోనే ఈత కొట్టేవాళ్ళు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకు బెండు కట్టి ఈత నేర్పేవాళ్లు. పెద్ద పిల్లలకు కూడా ఈత నేర్పేంత ఈతగాడు రాముడు. వాడు బావిలోకి దూకే విధానం, నీళ్లలో వేసే మునకలు వేగంగా ఈత కొట్టడం.. చాలా ముచ్చటగా, థ్రిల్లింగ్ గానూ ఉండేది చూసే తమకు. వెంకటలక్ష్మి మరీ మురిపెంగా చూసేది. రాముడు తనకు మేనమామ కొడుకే. ఎల్లమ్మ జాతరకు వచ్చిన రాముడి తల్లి ప్రమాదవశాత్తు ఇదే బావిలో పడి చనిపోతే రాముడ్ని తమ ఇంట్లోనే పెట్టుకొని పెంచారు వెంకటలక్ష్మి తల్లిదండ్రులు.
తర్వాత కొంత కాలానికే అనూహ్యంగా ఇదే బావిలో పడి వెంకటలక్ష్మి తల్లి కూడా చనిపోతే ఇద్దర్నీ వెంకటలక్ష్మి నానమ్మే సాకింది. ‘ఒరేయ్! మాకు కూడా ఈత నేర్పీరా!’ అని తను, వెంకటలక్ష్మి కూడా రాముడ్ని బతిమిలాడే వాళ్ళు. ‘దీనికి నేర్పిస్తా! నీకు మాత్తరం నేర్పీను. అమ్మో! మీ అప్ప పెద్దపులి. నాకు భయమబ్బా’ అనేవాడు రాముడు. వెంకటలక్ష్మికి నేర్పాడు కూడా. ఈత కొడుతూ కేరింతలాడే వాళ్ళని చూస్తూ తను ఉక్రోష పడేది. వాళ్ళిద్దరి చిన్ననాటి నెయ్యం మూడుముళ్ల బంధం అయింది.
చూడ చక్కని జంట! చిలుకాగోరింకల్లా అన్యోన్యంగా, ఆనందంగా వున్న ఆ జంటను చూసి విధికే కన్ను కుట్టిందేమో! మృత్యువు .. బావి రూపంలో వచ్చి రాముడ్ని మింగేసింది. ‘వెంకటలక్ష్మీ! రాముడు గజ ఈతగాడు కదా? వాడు నీళ్లలో మునిగి చనిపోవడం ఏమిటి?’ హఠాత్తుగా అడిగింది రోజా. ‘మొక్కే దేముడే యముడై ముంచేస్తే ఏం చేస్తాములే మా!’ నిర్లిప్తంగా అంది వెంకటలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ. ‘అదేమట్లంటావు? అసలేం జరిగిందా రోజు? నువ్విక్కడే వున్నావుగా?’ రోజా దీర్ఘంగా చూస్తూ అడిగింది. ‘ఏమి జరక్కూడదో అదే జరిగిపోయినంక ఇంగిపుడు ఏంజేస్తాములే మా!’ నిర్వేదంగా అంది వెంకటలక్ష్మి.
‘బాయిలో పడేనబ్బుడు గోడకు తగిలి తల పగిలిందన్నారు’ శుష్కహాసం చేసింది. ‘అయినా గడా ఈ బాయికి ఎంత దాహమో! మాయమ్మ, అత్త, ఊర్లో చానా మంది ఆడవాళ్ల ఉసుర్లు.. కడాకు నా రాముడి ఉసురు గడా పోసుకొనింది. దీనికి వాయి వరసా లేదు’ వెంకటలక్ష్మి మాటలు కోపం, దుఃఖం, బాధ కలగలిపి జీరగా ఉన్నాయి. ‘అది కాదు వెంకటలక్ష్మీ..’ రోజా ఏదో అనబోయేంతలో మధ్యలో కలగజేసుకుంది వెంకటలక్ష్మి.. ‘అంతంత పెద్ద సదువులు సదివినావు కదా! ఏదొక దినం నీకే అర్తమవుతాది లే. పదమా! అమ్మ ఎదురు సూస్తాంటాది’ అంటూ ముందుకు నడిచింది.. కోసిన మల్లెమొగ్గలు కొంగులో మూటకట్టుకొంటూ! ‘కుప్పా! రెడ్డప్ప బాయికాడ ఏమి లిబ్బి పెట్టిండాడో! ఎంచేపూ ‘బాయి.. బాయి..’ అని కలవరిస్తానే ఉండాడు. ఏందో నీ పున్యాన.. ఆ ఆయురేద మందులు, నువ్వు చేసే నూనె మర్తన.. పని చేస్తుండబట్టి ఇబ్బుడు నాలుగు అడుగులు ఏస్తా వుండాడో లేదో.. బాయి కాడికి పోవాలని పల్లాయి ఎత్తుకొన్యాడు.
పోయీ మెల్లంగా తీస్కపోరా!’ రెడ్డెప్పకు కాలు, చెయ్యి నూనె మసాజ్, స్నానం చేపించి.. బట్టలు తొడిగి.. టిఫిన్ తినిపించి.. టీవీ ముందు వాలు కుర్చీలో కూర్చోబెట్టి వచ్చిన కుప్పడికి చద్దన్నం పెడుతూ అంది సావిత్రమ్మ. కుప్పడు ఇడ్లీలు, దోశలు తినడు. మూడు పూటలా అన్నమే కావాలంటాడు. ఆ రోజు శుక్రవారం. తలారా స్నానం చేసి తన పొడవాటి జుట్టును కింద జారుముడి వేసి ఇంత మల్లెపూల దండ పెట్టుకుంది. పసుపు రాసిన మొహంలో పావలా కాసంత నిండు ఎరుపు కుంకుమ బొట్టుతో లక్ష్మీదేవిలా కళకళ్ళాడుతున్న సావిత్రమ్మను అలా చూస్తూ ఉండిపోయాడు కుప్పడు తినడం కూడా మర్చిపోయి. ‘పర్వాలేదు లేరా బాద, కస్టం, ఏడుపూ.. అన్నీ మర్చిపోతిన్లేరా! అసలుకు అయ్యన్నీ అలవాటైపోయిండ్లా? ఎదిరించడం, ఎదురు మాటాడటం.. తెలీకుండానే మన కాలం గడిచిపోయ కదా! మన బిడ్డలు బాగుంటే సాలనుకుంటిమి.
కానీ.. దేముడని నమ్మితే.. నీకు, నీ బిడ్డకు గడా అన్నాయమే చేసినాడా ముండా దేముడు. ఆ పొద్దు నీ పెండ్లాన్ని, చెల్లిని, ఇబ్బుడు నీ అల్లుడ్ని గడా తీస్కపోయి’ గద్గదంగా అంది సావిత్రమ్మ. ఆమె కళ్ళు ఉబ్బి, మంకెన పువ్వుల్లా ఎర్రగా ఉన్నాయి. కుప్పడు మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు గానీ గుండెలో అదురు పుట్టింది. సావిత్రమ్మ మాటలు వింటున్న వెంకటలక్ష్మి కూడా బొమ్మలా అయిపోయి అలా చూస్తోంది. ఇద్దరి కళ్ళూ ధారాపాతంగా వర్షించడం మొదలెట్టాయి. అది చూసి ‘ఏంరా కుప్పా? ఏమైందీ’ సావిత్రమ్మ కంగారుగా అడిగింది.
ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపుతూ చేతిలోని పచ్చిమిరపకాయ చూపించాడు కుప్పడు. ‘నువ్వెందుకు ఏడస్తాండావే ఎంకటమ్మా?’ వెంకటలక్ష్మి వేపు తిరిగింది సావిత్రమ్మ. వెంకటలక్ష్మి ఒడిలో ఉన్న చాటలో తను తొక్క తీస్తున్న ఉల్లిపాయలు చూపింది. ‘బాగుండాదిలే మీ కత! నిన్ను మిరపకాయ, దాన్ని ఎర్రగడ్డ ఏడ్పిస్తాండాయా?’ నిట్టూర్చింది సావిత్రమ్మ. ‘అది సరే.. చిన్న బిడ్డ.. ఎర్రగడ్డ గాటు తట్టుకోలేదు. నీకేందిరా కుప్పా? ఇంత జీవితం చూసినంక గడా అంతంత కారం మింగినాక గడా ఇంగా ఏడుస్తాంటే ఎట్లా ? తిను. తిను. తినేసి రెడ్డెప్పను బాయి కాడికి తొడ్కో పో! ఎంకటమ్మను నీ కూడా తీస్కపో! తోడుంటాది. ఇద్దురూ భద్రం! ముందూ ఎనకా చూస్కోండి’ జాగ్రత్తలు చెప్తూనే సావిత్రమ్మ దేవుని గదిలోకి వెళ్ళిపోయింది.
‘అప్పా! నెలలు నిండిపోయినాయంట. రెండు మూడు దినాల్లో పురుడొచ్చేస్తాదని సెప్పింది నర్సమ్మ. పుట్టేది రాముడే. వాడీ భూమ్మీద పడేలోగా..’ పొద్దున గొడ్లచావిట్లో తండ్రిని పట్టుకొని ఏడుస్తున్న వెంకటలక్ష్మి.. సావిత్రమ్మను చూసి మాట మింగేసింది. ఆమె ప్రతి శుక్రవారం గోపూజ చేస్తుంది. పూజా సామగ్రి పళ్ళెంతో వచ్చింది. ‘తొలి కాపు కదమా! బిడ్డ బయపడతాంది’ కుప్పడు సావిత్రమ్మను చూసి తడబడ్డాడు. ‘తల్లి లేని బిడ్డ. తొలి కానుపు భయం ఉంటాదిలే! ఇంట్లో ఆడదిక్కు లేదు. తోడుగా మీ చెల్లిని రమ్మన్నానంటివే! ఇంగా రాలేదా?’ కుప్పడు ఒళ్ళంతా తోమి, కడిగి తయారుగా వుంచిన ఆవు నొసట్న పసుపు కుంకుమ పెడుతూ అడిగింది. ‘చెనిగి చెట్లు పెరకతాండారంటమా! ఈ పొద్దు అయిపోతాది రేపటికంతా వొచ్చేస్తానని చెప్పింది’ చెప్పాడు కుప్పడు.
‘సరే! అయినా గడా ఎంకట్లక్ష్మి పే..ద్ద ధైర్నవంతురాలని రోజమ్మ అంటాంటాంది. నువ్వేమిట్లా ఎర్రిగొడ్డులా ఏడస్తాండావు?’ అంది సావిత్రమ్మ ఆవు చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ! ‘మనూరి నర్సమ్మ చెయ్యివాసి మంచిది. నీకేం కాదులేమే! మంచిగా కానుపైతాదిలే! ఆ దేముడు, రాముడు నీకు తోడుంటార్లే!’ ధైర్యం చెప్పింది. సావిత్రమ్మ.. రెడ్డెప్పను బావి దగ్గరకు తీసుకుపొమ్మని చెప్పి లోపలికి వెళ్ళిపోయాక ఒకరి మొహాలొకరు చూసుకున్నారు తండ్రీ కూతుళ్ళు! కూడబలుక్కున్నట్లుగా ఇద్దరూ ఒకేసారి లేచి నిలబడ్డారు కళ్ళు తుడుచుకొంటూ! ‘అప్ప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడనేలేదు.
కర్రసాయం లేకండా నడవలేడు. ఆయన అడిగితే మాత్రం నువ్వు ఎట్లా పంపించినావు మా బావి దగ్గరకు? అక్కడేమి పుట్టి మునిగిపోతా ఉందని?’ రోజా తల్లిని నిలదీసింది నిష్ఠూరంగా. తండ్రి చనిపోయి దశ దిన కర్మలు ముగిశాక.. బంధువులంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయాక తల్లి కూతుర్లు మిగిలారు ఇంట్లో. బావి దగ్గరికి వెళ్లిన తండ్రి కాలుజారి బావిలో పడిపోయాడు. కాపాడాలని కుప్పడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘ఏం చేసేది రోజమ్మా? ఆయనే పొద్దు నా మాట యిన్నాడని? అసలుకు ఏమన్నా ఎదురు చెప్పే ధైర్నమన్నా నాకుండేనా? అయినా.. కిష్ణుడు గీతలో చెప్పినట్టు నా మాట నిమిత్తమాత్తరమే! ఆయన సావు ఆయనే తెచ్చుకొన్యాడు.’
‘నువ్వే తీసుకుపొమ్మన్నావని చెప్పినాడే కుప్పడు?’ సాలోచనగా చూసింది తల్లి వైపు. ‘అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా. వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. ముందు దాని దుక్క బారం తీరాల.
అబ్బుడే అది కనే బిడ్డను సంతోసంగా సాకతాది అన్పించె నాకు. కడుపుతో వున్న.. తల్లి లేని బిడ్డ కోరికను తల్లి మాదిరి తీర్చల్ల కదా!’ సావిత్రమ్మ శూన్యంలోకి చూస్తూ నిర్లిప్తంగా, నిర్విచారంగా, నిర్వేదంగా చెబుతుంటే రోజా గుడ్లప్పగించి చూస్తోంది. తానేం అడిగింది.. తల్లి ఏం చెబుతోంది? అర్థంకాని అయోమయం! హఠాత్తుగా ఆమె కళ్ళల్లో తానా రోజు బావి దగ్గర గదిలో చూసిన చిందరవందర సామాను, ఎండిపోయిన మల్లెపూల దండలు, పగిలిన గాజు ముక్కల దృశ్యం కదలాడింది. ‘బాయిలో వున్న ఎంతోమంది ఉసుర్లు సంతోసంగా, ప్రెసాంత బడిన దినాన బాయి దాహం తీర్తాది’ వెంకటలక్ష్మి కసి మాటలు గుర్తొచ్చాయి.
ఊర్లో వాళ్ళు, బంధువులు, సేద్యగాళ్ళు, పొలం పనులకు వచ్చే కూలి వాళ్ళు ‘లక్ష్మీదేవి, అన్నపూర్ణమ్మ తల్లి’ అని పొగుడుకొనే అమ్మలో దుష్టశిక్షణ చేసే ఒక కాళికా మాత కనిపించింది రోజా కళ్ళకి. తల్లి దగ్గరగా జరిగి గట్టిగా కౌగిలించుకొని బుగ్గపై ముద్దు పెడుతుంటే ఆమె బుగ్గ తడి తియ్యగా తగిలింది. అవునుమా! చెప్పినా. వాల్లిద్దరి దుక్కం సూడ్లేకపోయినా.
వాల్లు తాతల తరాల నుండి మన ఇంటినే నమ్ముకొని బతికే సేద్దిగాల్లు. వాల్లకు అన్నాయమే జరిగింది. ఎంకటమ్మ నీ ఈడే కదా? అంటే మాక్కూడా బిడ్డ మాదిరే కదా? అమా.. అమా.. అనుకుంటా నా కూడా తిరగతా ఇంట్లో పెరిగిన బిడ్డ కదా! ఇబ్బుడు కడుపుతో వుండాదా? అది సంతోసంగా వుండాల్సిన టయమిది. కానీ దాని ఖర్మానికి.. కడుపులో బిడ్డతోపాటు.. గుండెలో మొగుడు పోయిన దుక్కం గడా మోస్తాంది. - యం.ఆర్ అరుణకుమారి
Comments
Please login to add a commentAdd a comment