
సాక్షి, బెంగళూరు: ఎంటెక్ చదివిన కుర్రాడికి సేద్యంపై మనసైంది. తానే యంత్రమై బావి తవ్వి అపరభగీరథుడిగా మారి పాతాళ గంగమ్మను పైకి తీసుకొచ్చాడు. బీదర్ జిల్లా ఔరద్ తాలూకాకు చెందిన సూర్యకాంత్ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఇంటిబాటపట్టాడు. పంటల సాగు చేసేందుకు నీటి కోసం ఒక్కడే తన పొలంలో 12 అడుగుల లోతు, 30 అడుగులు వ్యాసార్ధంతో తవ్వగా నీరు పడింది. సూర్యకాంత్ తవ్విన బావిలోని నీటిని గ్రామస్థులు తాగటానికి ఉపయోగిస్తున్నారు.
చదవండి: యువతిపై యాసిడ్ దాడి.. ట్రెండింగ్‌లో యాసిడ్ అటాక్