
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కోటబోమ్మాళి మండలం పాకీవలస వద్ద రోడ్డు ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న నేల బావిలో పడిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో చిక్కుకుపోయిన డ్రైవర్, క్లీనర్ మృతదేహాలను పోలీసులు బావి నుంచి బయటకు తీశారు. మృతి చెందిన డ్రైవర్, క్లీనర్ ఒడిశాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం