నాగ్‌పూర్:కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్‌లో చేరవలసిందిగా దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను ఈ మేరకు ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన పనికంటే బీజేపీ 9 ఏళ్లలోనే రెండింతల పని చేసినట్లు చెప్పారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని బాంధ్రాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవతం తొలినాళ్ల నాటి విషయాలను పంచుకున్నారు.
అయితే..గడ్కరీ రాజకీయ జీవితం అంతా ఆర్‌ఎస్‌ఎస్‌తో ముడిపడి ఉంది. ఏబీవీపీ నుంచి విద్యార్థి నాయకునిగా మొదలైన ఆయన ప్రస్థానం ఆర్‌ఎస్‌ఎస్ విలువలతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ కోసం నిజాయితిగా కష్టపడి పనే చేసే కార్యకర్తగా నితిన్ గడ్కరీ మంచి పేరు సంపాదించుకున్నారు.
'మనదేశ ప్రజాస్వామ్య చరిత్రను మర్చిపోవద్దు. గతం నుంచి మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో గరీబి హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ నెరవేర్చలేకపోయింది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది.'అని గడ్కరీ అన్నారు. దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ సఫలుడయ్యాడని కొనియాడారు.
ఇదీ చదవండి:ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు..
Comments
Please login to add a commentAdd a comment