చిన్నారిని ఎత్తుకెళ్లిన కోతి..విషాదం | Monkey Runs Off With Baby Found Dead In Well | Sakshi
Sakshi News home page

చిన్నారిని ఎత్తుకెళ్లిన కోతి..విషాదం

Published Mon, Apr 2 2018 1:37 PM | Last Updated on Mon, Apr 2 2018 5:20 PM

Monkey Runs Off With Baby Found Dead In Well - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఒడిశా: 16 రోజుల  చంటి పిల్లాడిని కోతి ఎత్తుకెళ్లిన ఘటన విషాదాంతమైంది. గత శనివారం ఇంట్లో తల్లిపక్కన నిద్రపోతున్న 16 రోజుల శిశువును ఇంట్లోకి చొరబడ్డ కోతి ఎత్తుకెళ్లింది. అది గమనించిన తల్లి గట్టిగా అరవడంతో కోతి  చిన్నారిని తీసుకుని దూరంగా వెళ్లిపోయింది. తర్వాత పిల్లాడి శవం ఇంటి పక్కనున్న బావిలో వెలుగు చూడటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయ్యింది. ఈ సంఘటన ఒరిస్సాలోని కటక్‌ జిల్లాలో చోటుచేసుకుంది. 

అంతకుముందు ఘటనపై బాధిత కుటుంబం అధికారులకు సమాచారమివ్వడంతో గాలింపు చర్యలు ఊపందుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఇంటి పక్కనున్న బావిలో బాబు శవం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పోలీసు అధికారి బిస్వరంజన్‌ సాహూ మట్లాడుతూ.. పిల్లాడిని ఎత్తుకెళ్లిన కోతి కొద్ది సేపటి తర్వాత బావిలో పడేసుంటుందని అభిప్రాయపడ్డారు. కెరీర్‌లో ఇలాంటి కేసును మొదటి సారిగా చూశానని ఆయన చెప్పారు.  చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement