
లంగర్‌హౌస్: బాపూఘాట్‌లో పురాతన పుష్కరిణి బావిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లంగర్‌హౌస్ త్రివేణి సంగంలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన బావిని జీఎంఎస్ స్వచ్ఛంద సంస్థ పునరుద్ధరించింది.
గోడలకు మొలిచిన చెట్లను తొలగించి బావికి మరమ్మతులు చేయించి రంగులు వేశారు. కేటీఆర్ సోమవారం ఈ బావిని ప్రారంభించి, ఇందులో గంగా జలాన్ని, తాబేళ్లను వదిలారు. కార్యక్రమంలో ఆయన వెంట మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment