కోనేరు బావి ప్రాంతాన్ని సందర్శించిన తలసాని
బన్సీలాల్‌పేట్: బన్సీలాల్‌పేట్‌లోని చరిత్రాత్మక కోనేరు(మెట్ల)బావిని ఈ నెల 5న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం ఆయన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, స్ధానిక కార్పొరేటర్ కె.హేమలత, తలసాని సాయికిరణ్ యాదవ్, పవన్‌కుమార్ గౌడ్‌లతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి కోనేరు బావిని సందర్శించారు.
అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ నెల 5న సోమవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ కోనేరు బావిని ప్రారంభిస్తారని తెలిపారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు.
అందులో భాగంగానే కేటీఆర్ ప్రత్యేక చొరవతో హెచ్‌ఎండీఏ అధ్వర్యంలో బన్సీలాల్‌పేట్ కోనేరు బావి రూపురేఖలు మార్చి వెలుగులోకి తెచ్చినట్లు చెప్పారు. కోనేరు బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పరిసరాలను అందంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కల్పన, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఈ అనిల్‌రాజ్, ఈఈ సుదర్శన్, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్ శాఖ డీఈ శ్రీధర్, రాఘవేంద్ర, డీఈ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment