బావిలోంచి తీసిన ఆధార్ కార్డులు
సాక్షి, ముంబై: ఒకవైపు బ్యాంకు ఖాతా, సంక్షేమ పథకాలు సహా పలు రకాలుగా ఆధార్ నంబర్‌ను అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుండగా ఓ షాకింగ్ ఉదంతం ఒకటి కలకలం రేపింది. ఒక పాడుబడిన బావిలో ఒరిజినల్ ఆధార్ కార్డులు దర్శనమివ్వడం షాకింగ్‌కు గురి చేసింది. మహారాష్త్ర యవత్‌మాల్‌లోని షిండేనగర్ ప్రాంతంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..తాగునీటికి తీవ్ర కొరత దృష్ట్యా నీటి వనరులను ఉపయోగించుకునేలా కొంతమంది యువకులు చొరవ చూపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఒక బావిని బాగు చేసుకునేందుకు రంగంలోకి దిగారు. యవత్‌మాల్ నగరంలోని యువకుల ప్రయత్నాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్ రాజేష్ దేశ్‌ముఖ్‌తోపాటు కొంతమంది ఎన్‌జీవోలు కూడా బావులు నుంచి చెత్తను తొలగించటానికి ముందుకు వచ్చాయి. ఇక్కడే అందరూ విస్తుపోయేలా సంఘటన.. వేలాది ఒరిజినల్ ఆధార్‌కార్డుల సంచులు వెలుగు చూశాయి. నైలాన్ గోనె సంచుల్లో ప్యాక్ చేసి, రాళ్ళతో కట్టిమరీ పారవేసిన వేలాది ఆధార్ కార్డులను వారు కనుగొన్నారు. దీంతో అవాక్కయైన అధికారులు విచారణకు ఆదేశించారు. దర్యాప్తుకోసం ఒక కమిటినీ ఏర్పాటు చేశామని, పూర్తి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించారు. మరోవైపు బావిలో ఉన్న ఆధార్‌కార్డుల పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, వివరాలు వివరాలు చదవగలిగేలా ఉన్నాయట.
Comments
Please login to add a commentAdd a comment