హత్యకు గురైన కిషోర్‌కుమార్ (ఫైల్) అరెస్టయిన విఘ్నేష్
వేలూరు: సెల్‌ఫోన్ ఇవ్వక పోవడంతోనే బావిలో తోసి హత్య చేశానని నిందితుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వేలూరు జిల్లా ఆంబూరు తాలుకా అయగాపురి గ్రామానికి చెందిన కూలి శంకర్ కుమారుడు కిషోర్‌కుమార్ (8) ఆదివారం ఉదయం ఆంబూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులోని బావిలో మృతదేహంగా తేలుతున్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి విచారణ చేపట్టారు ప్రాథమిక విచారణలో అదే గ్రామానికి చెందిన విఘ్నేష్, కిషోర్‌కుమార్ సెల్‌ఫోన్ విషయంలో ఘర్షణ పడినట్లు,ఈ కారణంగానే విఘ్నేష్, కిషోర్‌కుమార్‌ను బావిలో తోసి హత్య చేసినట్లు తెలిసింది. కిషోర్‌కుమార్, అదే గ్రామానికి చెందిన నవీన్ స్నేహితులు.
నవీన్ క్రికెట్ ఆడే సమయంలో సెల్‌ఫోన్‌ను కిషోర్‌కుమార్‌కు ఇచ్చేవాడు. ఆదివారం యథావిదిగా నవీన్ సెల్‌ఫోన్ ఇవ్వడంతో కిషోర్‌కుమార్ ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో సెల్‌ఫోన్ తిరిగిచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో నవీన్ లేకపోవడంతో సెల్‌ఫోన్‌ను విఘ్నేష్ అనే యువకుడికి ఇచ్చి నవీన్‌కు ఇమ్మని చెప్పాడు. అనంతరం సెల్‌ఫోన్ తనకు ఇవ్వలేదని విఘ్నేష్ ప్లేటు ఫిరాయించడంతో అతనికి, కిషోర్‌కుమార్‌కు ఘర్షణ ఏర్పడింది. ఈ విషయాన్ని కిషోర్‌కుమార్ పెద్దలకు తెలియజేస్తాడనే ఉద్దేశంతో సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లి బావిలో తోసి హత్య చేసినట్లు విఘ్నేష్ ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment