
బావి లోపల ఉన్న రౌతు శ్రీనివాస్ బావి నుంచి బయట పడిన తర్వాత..
పశ్చిమగోదావరి, నిడదవోలు: నిడదవోలు పాత కెనరా బ్యాంక్ సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈసంఘటన స్థాని కంగా సంచలనం కలిగించింది. వివరాలిలా ఉన్నా యి. పట్టణంలోని 11వ వార్డులో నివాసముంటున్న రౌతు శ్రీనివాస్ గురువారం మద్యం మత్తులో బావిలోకి దూకేశాడు.
సుమారు 40 అడుగుల లోతున్న బావిలో 30 అడుగుల కిందకు నీళ్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులు రక్షించే క్రమంలో తాడు వేశారు. ప్రాణభయంతో తాడును పట్టుకుని బావిలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపకశాఖ అధికారులు ఇక్కడకు వచ్చారు. అగ్నిమాపకాధికారి జె. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది నిచ్చెన సాయంతో శ్రీనివాస్‌ను రక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment