
బావిలో నుంచి నూర్జహాన్ మృతదేహాన్ని బయటకు తీస్తున్న స్థానికులు
వేంపల్లె : మండల పరిధిలోని టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన బండె నూర్జహాన్(40) మంగళవారం సాయంత్రం బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పాలపల్లెకు చెందిన బైబిరెడ్డి సన్న నిమ్మతోటను టి.వెలమవారిపల్లెకు చెందిన బండె గుర్రప్ప కౌలుకు తీసుకున్నాడు. గుర్రప్ప, భార్య నూర్జహాన్ నిమ్మతోటలో పని చేసేందుకు వెళ్లారు. నీరు తాగేందుకు తేవడానికి బిందెను తీసుకొని బావిలోకి దిగింది. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడింది. ఈత రాకపోవడంతో బయటకు రాలేక చనిపోయింది. ఆమె ఎంత సేపటికి రాకపోవడంతో భర్త గుర్రప్ప బావి దగ్గరికి వెళ్లి చూడగా నీళ్లలో తేలియాడుతోంది. గుర్రప్ప కేకలు వేయడంతో చుట్టూ పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని వేంపల్లె ఎస్‌ఐ చలపతి పరిశీలించారు. మృతదేహానికి వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment