
కెలమంగలం,(బెంగళూరు): అంచెట్టి సమీపంలో 7 నెలల చంటిబిడ్డతో పాటు తల్లి బావిలో శవమై తేలింది. వివరాలు... అంచెట్టి సమీపంలోని మేటుకొటాయ్ గ్రామానికి చెందిన వెంకటేష్ భార్య దీప (23) రెండేళ్ల క్రితం కుటుంబ గొడవలతో పురుగుల మందు తాగింది. చికిత్సానంతరం భార్యాభర్తలు విడిపోయారు. సంవత్సరం తర్వాత భర్త వెంకటేష్ భార్యను తిరిగి కాపురానికి తీసుకువచ్చాడు. ఇటీవల పుట్టింటికి తీసుకెళ్లాలని దీప మొరపెట్టుకొంది.
రెండు రోజులు తర్వాత వెళ్దువులే అనడంతో ఏడు నెలల చిన్నారితో సోమవారం రాత్రి సమీపంలోని బావిలో పడి ఆత్మహత్య చేసుకొంది. ఇంట్లో కోడలు కనిపించకపోయే సరికి అత్త చుట్టు పక్కల గాలించింది. ఈ సమయంలో దీప, చిన్నారి బావిలో శవాలై కనిపించారు. అంచెట్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను స్వాధీనం చేసుకున్నారు. దీప ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి బావిలో పడేశారని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: ప్రేమ పేరుతో యువతికి బెదిరింపులు.. ఇంట్లో ఎవరూ లేని టైంలో
Comments
Please login to add a commentAdd a comment