70 ఏళ్లుగా ఉండేది.. బావి కనపడుట లేదని పోలీసులకు ఫిర్యాదు | Tamil Nadu: Villagers File Police Complaint to Trace Missing Well | Sakshi
Sakshi News home page

70 ఏళ్లుగా ఉండేది.. బావి కనపడుట లేదని పోలీసులకు ఫిర్యాదు

Published Thu, Aug 11 2022 9:13 AM | Last Updated on Thu, Aug 11 2022 9:38 AM

Tamil Nadu: Villagers File Police Complaint to Trace Missing Well - Sakshi

సాక్క్షి, చెన్నై: ఓ సినిమాలో నటుడు వడివేలు తమ ప్రాంతంలో బావి కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెతికి పెడతామంటారు. సరిగ్గా అలాంటి సన్నివేశాన్ని తలపించే ఘటన మధుర వాయిల్‌ మార్కెట్‌ వెనక ఉన్న భారతీయ వీధిలో జరిగింది. తమ ప్రాంతంలోని బావి కనిపించడం లేదంటూ స్థానికులు పోలీసులను ఆశ్రయించారు.

మధుర వాయిల్‌ మార్కెట్‌ వెనక ఉన్న వీధిలో మండలం 144లో సర్వే నంబర్‌ 113ఏ, 114ఏ/2ఏ లో 70 ఏళ్లుగా బావి ఉండేదని, దానిని ప్రజలు ఉపయోగించుకునేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బావి కనబడలేదని, అదృశ్యమైందని, ఆ బావిని కనిపెట్టాలని అయ్యప్పకం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త దేవేంద్రన్, మధుర వాయిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement