
సాక్షి, చిత్తూరు : జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కుప్పం మండలం ఒంటూరు గ్రామంలో బావిలో పడి నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. తొలుత ప్రమాదవశాత్తు ముగ్గురు బావిలో పడిపోగా.. వారికి కాపాడేందుకు వెళ్లి మరో మహిళ మృత్యువాత పడింది. మృతుల్లో చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకే గ్రామంలో నలుగురు మృతిచెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు అప్పటి వరకు తమ ముందు ఉన్న పిల్లలు విగతజీవులుగా మారడంతో ఒంటూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు.. రుక్మిణి భాయ్ (36), ఆరతి (8), కీర్తి (6), రాజేశ్వరి (26).
Comments
Please login to add a commentAdd a comment