ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహం.. యువతిని బావిలోకి నెట్టేసి! | Karnataka Woman Pushed Into 60 Foot Well By Instagram Friend | Sakshi
Sakshi News home page

స్నేహితురాలిని బావిలో నెట్టేసిన యువకుడు

Published Fri, Oct 16 2020 2:47 PM | Last Updated on Fri, Oct 16 2020 4:34 PM

Karnataka Woman Pushed Into 60 Foot Well By Instagram Friend - Sakshi

బెంగళూరు : సోషల్‌ మీడియా స్నేహం ఓ యువతి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన స్నేహితురాలిని కాటికి పంపేందుకు సాహసించాడు ఓ ప్రబుద్ధుడు. అయితే అదృష్టవశాత్తు యువతి ప్రాణాలతో బయట పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. కోలార్‌ జిల్లాలో నివసిస్తున్న ఓ యువతికి(22) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదర్శ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ ఇటీవల తొలిసారిగా కలుసుకునేందకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదర్శ‌ను కలిసేందుకు శనివారం యువతి బెంగుళూరు రూరల్‌ జిల్లాలోని దేవనహళ్లి ప్రాంతానికి వెళ్లింది. చదవండి: బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు

అక్కడ కొద్దిసేపు మట్లాడిన అనంతరం ఆమెను దగ్గరలోని పొలంలోకి తీసుకెళ్లి 60 అడుగుల లోతు బావిలోకి నెట్టివేశాడు. బావిలో పడిపోవడంతో యువతి చేయి విరిగిపోయింది. అంతేగాక దాదాపు మూడు రోజులపాటు అలాగే బావిలోనే గడిపింది. చివరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు మంగళవారం యువతిని రక్షించారు. తీవ్ర గాయాలయ్యి నీరసించిపోవడంతో యువతిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ చర్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విజయపుర పోలీసులు తెలిపారు. నిందితునిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు వెల్లడించారు. చదవండి: కీసర ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement