Online friendship
-
ఆన్లైన్ పరిచయం.. ఐదేళ్ల ప్రేమ.. రెండుసార్లు అబార్షన్ చేయించి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. ప్రేమ పేరుతో అయిదు సంవత్సరాలు శారీరకంగా వాడుకున్నాడు. ఈక్రమంలో రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. అయితే తీరా పెళ్లి చేసుకోమని పట్టుబడితే ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే కులం ఒకటి కానందుకు మావాళ్ళు ఒప్పుకోవట్లేదని చేతులెత్తేశాడు. గత్యంతరం లేక బాధిత దళిత యువతి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా యువకుడు మోసం చేసినా, తనకు అతనితోనే వివాహం చేయించమని బాధితురాలు పోలీసులకు వేడుకుంది. చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి.. -
సొంత ఇంట్లో దొంగతనం చేసిన బాలిక.. విచారణలో ఏం చెప్పిందంటే?
కొచ్చి: టెక్నాలజీ మూలాన ఆన్లైన్ స్నేహాలు అందువల్ల మోసాలు జరుగుతున్నట్లు ఇటీవల పలు ఘటనలను చూస్తే అర్థమవుతుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన ఆన్లైన్ స్నేహితుల కోసం దొంగగా మారి తన ఇంట్లోనే 750 గ్రామలు బంగారాన్ని చోరి చేసింది. ఈ విచిత్ర ఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువనంతపురంకు చెందిన 15 ఏళ్ల బాలిక పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఒక సంవత్సరం ముందు శిబిన్ అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. అలా వారు స్నేహితులుగా మారారు. ఇటీవల శిబిన్ ఆ బాలికతో తన కుటుంబం అర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిపాడు. స్నేహితుని కష్టాలు విని కరిగిపోయిన ఆ బాలిక అతనికి సహాయం చేయాలని తన ఇంట్లో 750 గ్రాముల బంగారం చోరీ చేసి అతడికి ఇచ్చింది. ఆ బంగారం తీసుకున్న శిబిన్ తన తల్లితో కలిసి వాటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో తన ఇంటిని బాగు చేసుకుని మిగిలిన రూ.10 లక్షలను దాచుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన బంగారం కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని గ్రహించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో బాలికను ప్రశ్నించగా ఆమె అసలు విషయం బయట పెట్టింది. తన స్నేహితుడు శిబిన్కు రూ.750 గ్రాముల బంగారం ఇచ్చినట్లు తెలిపింది. శిబిన్ అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ అమ్మాయి తనకు కేవలం 270 గ్రాముల బంగారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. దీంతో మరో సారి ఆ బాలికను గట్టిగా ప్రశ్నించగా.. పాలక్కాడ్‌కు చెందిన మరో ఇన్స్టాగ్రామ్ స్నేహితునికి 40 గ్రాముల బంగారం ఇచ్చినట్లు వెల్లడించింది. బంగారం తీసుకున్నప్పటి నుంచి ఆ రెండో వ్యక్తి బాలికను బ్లాక్ చేసినట్లు తెలిపింది. కాగా బాలిక చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం.. -
రెండేళ్లుగా ఆన్లైన్ స్నేహం.. నమ్మి ఫ్లాట్‌కు వెళితే.. నలుగురితో కలిసి..
కొచ్చి: ఇటీవల సమాజంలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలిసిన వారే మోసం చేస్తున్న తరుణంలో ఓ యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఏకంగా 300 కిలోమీటర్లు వెళ్లింది. అలా వెళ్లడమే తన పాలిట శాపంగా మారింది. ఆమె నమ్మిన వ్యక్తి తనని మోసగించాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కేరళలోని కోజికోడ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కేరళలోని కొల్లాంకు చెందిని ఓ యువతి దాదాపు రెండేళ్ల క్రితం ఆన్లైన్లో కోజికోడ్‌కు చెందిన అనాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారడంతో అప్పటి నుంచి తరచూ వారు ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం, మెసేజ్‌లు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల అనాస్ ఆ యువతిని కోజికోడ్‌కి రావాలని బలవంతంగా చేయగా అందుకు తను అంగీకరించి గురువారం వెళ్లింది. అక్కడ ఆమెను రిసీవ్ చేసుకున్న ఆనాస్ ఓ ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆ ఫ్లాట్‌కి అతని ముగ్గురు స్నేహితులు కూడా వచ్చారు. వారందరూ కలిసి ఆ యువతి చేత బలవంతంగా మద్యం తాగించడంతో పాటు డ్రగ్స్ కూడా ఇచ్చారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను వీడియోలు, ఫోటోలు కూడా తీసుకున్నారు. యువతి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని గ్రహించి వారు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో వదులుతూ.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. అయితే ఆస్పత్రి సిబ్బంది యువతిపై జరిగిన దారుణం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధిత మహిళ నుంచి స్టేట్మెంట్, నిందితుడి ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా ఆనాస్‌ను అరెస్ట చేయగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: అయ్యో భగవంతుడా.. పొట్ట కూటి కోసమని వెళ్తుంటే.. -
సైబర్ శాడిస్ట్: ఇంటికొచ్చి ఫోన్ నంబర్ తీసుకొని..
సాక్షి, సిటీబ్యూరో: సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు పరిచయమైన యువతిని వివాహం చేసుకోవాలంటూ వేధిస్తున్న సైబర్ శాడిస్ట్‌ను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తుర్కయాంజల్ ప్రాంతానికి చెందిన సంతోష్‌కుమార్ ప్రస్తుతం ఔరంగాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి రెండు నెలల క్రితం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా బేగంపేట్‌కు చెందిన యువతి పరిచయమైంది. కొన్ని రోజులు ఆమెతో చాటింగ్ చేశాడు. ఆపై తనను వివాహం చేసుకోవాలంటూ వేధింపులు ప్రారంభించాడు. ఓ దశలో ఆమె చిరునామా తెలుసుకున్న సంతోష్ వారి ఇంటికి వెళ్లాడు. తానెవరో చెప్పకుండా అద్దెకు ఇల్లు కావాలంటూ ఆమె తండ్రితో మాట్లాడి ఆయన ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఇన్‌స్ట్రాగామ్ నుంచి సేకరించిన ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చాడు. వీటిని ఆమె తండ్రి ఫోన్‌కు పంపాడు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు నవంబర్‌లో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు నిందితుడిని గుర్తించారు. శుక్రవారం అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. సంతోష్ మరికొందరినీ ఈ పంథాలో వేధించినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. -
సోషల్ మీడియా స్నేహం.. ఫోటోలు మార్పింగ్ చేసి!
సాక్షి, సింగరేణి(కొత్తగూడెం): ఫొటోలు మార్ఫింగ్ చేసి బాలికను బ్లాక్మెయిల్ చేసిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర సీఐ బి.సత్యనారాయణతో కలిసి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కినపెల్లి శివకృష్ణ కొత్తగూడెంలోని గౌతంపూర్‌కు చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలు చెప్పి వాట్సాప్ ద్వారా ఆమె ఫొటోలు సేకరించాడు. ఫొటోలను మార్ఫింగ్ చేసి తిరిగి బాలిక వాట్సాప్‌కు పంపాడు. డబ్బులు, బంగారం ఇవ్వాలని లేకపోతే మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాలిక భయపడి అంగీకరించింది. చదవండి : ఆ నది రక్తంతో ఎరుపెక్కుతోంది.. సెప్టెంబర్ 19న తన స్నేహితులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్ విజయ్‌కుమార్‌లను గౌతంపూర్‌కు పంపాడు. వారు బాలిక నుంచి రెండు తులాల బంగారు ఆభరణం తీసుకుని, బెదిరించి వెళ్లారు. మళ్లీ ఈ నెల 3న శివకృష్ణ బాలికతో చాటింగ్ చేసి, రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము రుద్రంపూర్‌లోని ప్రగతివనం పార్కు వద్ద ఉన్నామని, వెంటనే డబ్బులు తెచ్చి ఇవ్వాలని బెదిరించాడు. విశ్వసనీయ సమాచారంతో టూ టౌన్ ఎస్హెచ్ఓ బి.సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా శివకృష్ణను, అతని మిత్రులు పాతకుంట సందీప్‌కుమార్, సుద్దపల్లి కార్తీక్, గిందమ్ విజయ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సీఐ సత్యనారాయణను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నడుస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పారు. ఎస్ఐలు రాజేందర్, రాంబాబు, ఏఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: విషాదం: ప్రేమికులిద్దరూ మృతి -
‘అపరిచిత ప్రేమికుడి’ బండారం బట్టబయలు..
ప్రేమ పేరిట యువతుల్ని దగా చేయడానికి పక్కాగా స్కెచ్ వేశాడు. గూగుల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగినంటూ యువతుల్ని మోసం చేసి దండుకోవడంలో ఆరితేరిపోయాడు. ఇతని ‘ప్రేమ’మాయలో పడిన ఓ యువతి లక్షలు సమర్పించింది. బంగారు ఆభరణాలూ ఇచ్చింది. సెల్ఫోన్లో పరిచయమై మూడేళ్లైనా కనిపించకుండా, అడ్రస్ చెప్పకుండా దాటవేస్తుండడంతో అనుమానించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ‘అపరిచిత ప్రేమికుడి’ బండారం బట్టబయలైంది. సాక్షి, పాకాల(చిత్తూరు) : గూగుల్ కంపెనీలో పని చేస్తున్నానని పాకాలకు చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం సెల్ఫోన్లో ఓ యువకుడు పరిచయం చేసుకున్నాడు. తన పేరు గుణశేఖర్(27) అని, తనది అనంతపురం జిల్లా అని చెప్పాడు. ప్రేమ పేరిట ఆమెను బుట్టలో పడేశాడు. యువతి అతన్ని ప్రత్యక్షంగా చూడలేదు. తనకు అత్యవసరం ఉందంటూ మూడేళ్ల వ్యవధిలో ఆమె నుంచి దాదాపు రూ.10 లక్షలు తీసుకున్నాడు. అతడు కోరినంత మొత్తాన్ని ఆన్లైన్లో పంపుతూ వచ్చేది. వ్యవసాయ కూలీలైన ఆమె తల్లిదండ్రులు వివాహం నిమిత్తం ఉంచిన నగలు, నగదును అతగాడికి సమర్పించింది. వీడియో కాల్ చేసినా ముఖం కనిపించకుండా చాట్ చేస్తుండడంతో చివరకు అనుమానించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేరే పేరుతో ఒకసారి అతడే నేరుగా వచ్చి డబ్బులు తీసుకున్నా ఆ యువతి గుర్తించకపోవడం కొసమెరుపు. ఫిర్యా దును సీరియస్‌గా తీసుకున్న సీఐ ఆశీర్వాదం, ఎస్ఐ రాజశేఖర్ సెల్ నంబర్, ఆన్లైన్ లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేశారు. నిందితుడు మండలంలోని మొగరాల పంచాయతీ గొల్లపల్లెకు చెందిన చిన్నస్వామి కుమారుడు అని తేలింది. కృష్ణాపురం వద్ద అతడిని అరెస్టు చేశారు. చదవండి: ఇత్తడి పాత్రకు అద్భుత శక్తి ఉందంటూ.. రికవరీ ఏం చేశారంటే.. నిందితుడి నుంచి రూ.5 లక్షల నగదు, అతడు తన తమ్ముడు జానకిరామ్ పేరుతో కొన్న రాయల్ ఎన్ఫీల్డ్, యువతి నుంచి తీసుకున్న బంగారు నల్లపూసల దండ, ఒక జత బంగారు కమ్మలు, చెంపసారాలు, నిందితుడు ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్, కీప్యాడ్ ఫోన్, ఏటీఎం కార్డులు, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఇతడు వన్యప్రాణులను కూడా వేటాడి విక్రయించే వాడని తేలిందని బుధవారం విలేకరులకు సీఐ చెప్పారు. కేసును ఛేదించిన ఎస్ఐ, కానిస్టేబుళ్లు ముక్తీశ్వర్, శివకు సీఐ రివార్డును అందజేశారు. మరికొందరు యువతుల్ని కూడా ఇతడు మోసగించి డబ్బులు పొందినట్లు తేలిందని, బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. చదవండి: 9 మంది ప్రాణం తీసిన నూడిల్స్ -
ఇన్స్టాగ్రామ్ స్నేహం.. యువతిని బావిలోకి నెట్టేసి!
బెంగళూరు : సోషల్ మీడియా స్నేహం ఓ యువతి ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఆన్లైన్లో పరిచయమైన స్నేహితురాలిని కాటికి పంపేందుకు సాహసించాడు ఓ ప్రబుద్ధుడు. అయితే అదృష్టవశాత్తు యువతి ప్రాణాలతో బయట పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటుచేసుకుంది. కోలార్ జిల్లాలో నివసిస్తున్న ఓ యువతికి(22) ఇన్‌స్టాగ్రామ్‌లో ఆదర్శ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే వీరిద్దరూ ఇటీవల తొలిసారిగా కలుసుకునేందకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదర్శను కలిసేందుకు శనివారం యువతి బెంగుళూరు రూరల్ జిల్లాలోని దేవనహళ్లి ప్రాంతానికి వెళ్లింది. చదవండి: బైక్‌ను ఢీకొట్టిన కారు; చితకబాదిన స్థానికులు అక్కడ కొద్దిసేపు మట్లాడిన అనంతరం ఆమెను దగ్గరలోని పొలంలోకి తీసుకెళ్లి 60 అడుగుల లోతు బావిలోకి నెట్టివేశాడు. బావిలో పడిపోవడంతో యువతి చేయి విరిగిపోయింది. అంతేగాక దాదాపు మూడు రోజులపాటు అలాగే బావిలోనే గడిపింది. చివరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు మంగళవారం యువతిని రక్షించారు. తీవ్ర గాయాలయ్యి నీరసించిపోవడంతో యువతిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ చర్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేయలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు విజయపుర పోలీసులు తెలిపారు. నిందితునిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లు వెల్లడించారు. చదవండి: కీసర ఎమ్మార్వో ఆత్మహత్య; ముందు రోజు ఏం జరిగింది? -
ఆన్లైన్ స్నేహాలు
మెసేజ్‌లతో పెరుగుతున్న అనుబంధాలు వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో ప్రత్యేక గ్రూపులు నేడు ఫ్రెండ్షిప్ డే సిద్దిపేట రూరల్ / జోగిపేట: స్నేహం.. ఓ మధురానుభూతి. అది కలకాలం నిలిచిపోతుంది. దీనికి గుర్తుగా ఓ మంచి బహుమతి ఇవ్వాలని స్నేహితులు ఆరాటపడుతుంటారు. ఏటా ఆగస్టు తొలి ఆదివారం జరుపుకొనే ఫ్రెండ్‌షిప్‌డే కోసం చిన్నపెద్దా ఎదురుచూస్తుంటారు. స్నేహనికి మధురస్మృతిగా చక్కటి బహుమతితో ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతారు. కానీ నేడు కొంచెం ట్రెండ్ మారింది. సోషల్ మీడియా అనుబంధాలకు వేదికగా నిలుస్తోంది. ప్రతి ఒక్కరికి అరచేతిలోనే టెక్నాలజీని వాడేస్తున్నారు. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపులు ఉండడంతో ప్రతి పండుగకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఒక్క మెసేజ్ పోస్టుతో స్నేహితులందరికి శుభాకాంక్షలను సులువుగా చెపుతున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ఫ్రెండ్షిప్ బాండ్లు కడతారు.. ఎస్.ఎం.ఎస్ లతో గ్రీటింగ్స్ చెబుతారు.. కుదిరితే కవ్పు కాఫీ, కాకుంటే కబుర్లు చెవ్పుకుని సరదాగా గడువుతారు. స్నేహితులు లేని మనిషి జీవితం ఒయాసిస్ లేని ఎడారిలాంటిదనే చెప్పవచ్చు. ’నీ వెంట నేనున్నా’ అనే భరోసా ఇచ్చేవాడే స్నేహితుడు. ఓటమిలో ఓదార్చేవాడే స్నేహితుడని చెప్పవచ్చు. ప్రస్తుత హైటెక్ యుగంలో.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతులో వాట్సప్, ఫేస్బుక్ ఉంటుంది. వీటికి భలే క్రేజీ ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఆన్లైన్ స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వాట్సప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరు పలకరించుకునే అవకాశం లభిస్తుంది. స్నేహితులు వాట్సప్, ఫేస్‌బుక్‌ల్లో ప్రత్యేకంగా గ్రూపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రూపుల్లో మంచి, చెడులను పోస్టు చేస్తున్నారు. పోస్టులకు లైక్‌లు కొడుతూ, షేర్లు చేస్తూ అభిరుచులను పంచుకుంటున్నారు. సిద్దిపేటలో 2005లో టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులంతా కలిసి ‘స్కూల్‌మెట్స్’ అని వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. ఇందులో ఒకరినొకరు పలకరిస్తూ, స్నేహభావాన్ని పంచుకుంటున్నారు. స్నేహితులతో, బంధువులతో, కుటుంబ సభ్యులతో, ఉద్యోగులు ఇలా గ్రూపులను ఏర్పాటు చేసుకుని స్నేహ సౌరభాన్ని ఆన్లైన్ వేదికగా కొనసాగిస్తున్నారు. ఒక్క స్మార్ట్ ఫోన్లో సుమారు 10కి పైగానే గ్రూపులు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. స్నేహంలో స్వార్థం ఉండకూడదు ఆపదలో ఉండి ధైర్యాన్ని ఇచ్చే వాడే నిజమైన స్నేహితుడు. స్వార్థంతో స్నేహం చేయడం మోసమే. స్నేహితుల మధ్య పెరిగేది స్నేహం పెరగాలే తప్ప తగ్గకూడదు. ఓటమిలోనూ నీవెంట నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. ఏళ్ల తరబడి స్నేహం చేసిన వారు ఈ సమాజంలో ఉన్నారు. కష్ట, సుఖాలలో కలిసి జీవించే వాడినే స్నేహితులుగా ఎన్నుకోవడం మంచిది. - అశోక్, చేనేత సహకార సంఘం చైర్మన్ నాకు తల్లిదండ్రులు స్నేహితులే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు స్నేహితులే. నేను పుట్టినప్పటి నుంచి అంధుడిగా ఉండడం వల్ల నా ఆలనా పాలనా చూస్తూనే స్నేహితులుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల కంటే స్నేహితులంటేనే నాకు తృప్తి ఉంటుంది. స్నేహితుల కంటే ఎక్కువగా అన్ని విషయాల్లోనూ నాతో చర్చిస్తుంటారు. భగవంతుడు మరో జన్మలో కూడా ఇలాంటి తల్లిదండ్రులనే ఇవ్వాలని కోరుకుంటాను. - విజయ్‌కుమార్, లెక్చరర్ -
ఆన్లైన్ స్నేహం.. డాక్టర్‌ను చేసింది
ఐదు సంవత్సరాల క్రితం... ఒక భారతీయ పాఠశాల విద్యార్థి... లండన్‌లోని ఒక రిటైర్డ్ టీచర్‌తో ఆన్లైన్ స్నేహాన్ని పెంచుకున్నాడు. ఆమె సహాయంతోఇప్పుడు డాక్టర్ అయ్యాడు. వారు ఇప్పటికీ ఒకరినొకరు చూసుకోలేదు కాని ఒకరు లేనిది ఒకరు జీవించలేనంతగా వారి మధ్య స్నేహం పెనవేసుకుంది. అతడి పేరు షారుఖ్ ఖాన్... ఆవిడ పేరు లిజ్ ఫ్యూయింగ్స్. షారుఖ్ ఖాన్‌కి పదమూడు సంవత్సరాల వయసున్నప్పుడు హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో చదువుతుండేవాడు. అక్కడ లాబ్‌లో పిల్లలందరికీ కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటరే అతడి జీవితాన్ని మార్చేసింది. ‘‘విద్యార్థులమంతా ఒక చిన్న గదిలో ఇంటర్నెట్ చూస్తూ కూర్చున్నాం. ఆ సమయంలోనే విదేశాలలో ఉన్న రిటైర్డ్ టీచర్‌తో చాట్ చేయడానికి అవకాశం దొరికింది’’ అన్నాడు షారుఖ్. ఇక్కడి పిల్లలకు అక్కడివారితో బంధం ఏర్పరచి వారిని మెంటర్లుగా చేయడం ఆ స్కూల్లోని విద్యావిధానం. ‘‘విదేశీయులతో మాట్లాడటం, వారి నుంచి కొంత నేర్చుకోవడం చాలా సరదాగా ఉంటుంది. నేను కంప్యూటర్ ముందు కూర్చుని అన్నిటినీ చూస్తూ వాళ్లతో మాట్లాడుతుంటాను. అలా పరిచయమయ్యారు లండన్ వాస్తవ్యురాలు లిజ్ ఫ్యూయింగ్స్’’ అంటాడు షారుఖ్ ఖాన్. ఫ్యూయింగ్ వయసు 60 సంవత్సరాలు. ఇటీవలే టీచర్‌గా రిటైర్ అయ్యారు. ఆవిడ తూర్పులండన్‌లోని హాక్నేలో నివాసం ఉంటున్నారు. 2009లో ఒక వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన చూసి ఆమె ఈ విభాగంలో చేరారు. మొదట్లో, ఫ్యూయింగ్ భారతీయ విద్యార్థులతో చాలామందితో మాట్లాడేవారు. కాని కొంతకాలానికి కేవలం ఖాన్ మాత్రమే మిగిలాడు. ‘‘అలా మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది’’ అంటారు ఆమె. ఇద్దరూ ఈ మెయిల్స్ రాసుకుంటుండేవారు. ఆవిడ సలహాలిస్తూ ఉండేది. ‘‘ఖాన్‌కి తొందరగా అర్థం చేసుకునే శక్తి అంతగా లేదు. అందుకే నేను ఏది చెప్పినా, అర్థమైందా? లేదా? అని అడుగుతుండేదాన్ని. మా ఇద్దరి మధ్యా చాటింగ్ సరదాలతో, విజ్ఞానాత్మకంగా సాగేది. అతడు కూడా నన్ను సరదాగా మాట్లాడుతుండే వాడు. నేనెప్పుడైనా పెద్ద అక్షరాలలో ఏదైనా రాశానంటే నాకు కోపం వచ్చిందని అతడికి అర్థం అవుతుంది. ఖాన్ మా ఇద్దరి మధ్య స్నేహాన్ని తను చదువులో రాణించేందుకు ఉపయోగించుకున్నాడు. అతడి ఇంగ్లిష్ బాగా ఇంప్రూవ్ అయింది’’ అంటారు ఫ్యూయింగ్స్. సంవత్సరాలు గ డుస్తున్నాయి. ఒకసారి ఖాన్ తనకు డాక్టర్ చదవాలనుందని, లండన్ యూనివర్సిటీకి అప్లయ్ చేస్తున్నాని చెప్పాడు. ఖాన్ వయసు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడే తండ్రి మరణించాడు. పెద్ద అన్నయ్య కుటుంబానికి ఆధారమయ్యారు. స్కూల్ ఫీజులు అన్నీ ఆయనే చూసేవారు. కానీ, విదేశాలలో చదవడానికి అప్లయ్ చేసుకోమని ఎన్నడూ సలహా ఇవ్వలేదు. ‘‘విదేశాల గురించి నాకేమీ తెలీదు. అక్కడి సంస్కృతి సంప్రదాయాలు తెలియవు’’ అంటాడు ఖాన్. ‘‘ఆవిడతో మాట్లాడిన తర్వాత లండన్‌లో జీవన విధానం గురించి అర్థమైంది. లండన్‌లో చదవడానికి ఎంత ఖర్చవుతుంది, ఎలా అప్లయ్ చేయాలి... వంటివి ఫ్యూయింగ్ మేడమ్ ఇంటర్నెట్లో చెక్ చేసి చెప్పారు. యూనివర్సిటీలలో ఎటువంటి మోసాలు జరుగుతాయో కూడా ఆవిడ వివరించారు. ‘‘ఖాన్ ఇంటర్నెట్లో చూసి కేంబ్రిడ్జిలో ఉండే కాలేజీల వివరాలు నాకు పంపేవాడు. ఒకరోజున ‘పోస్ట్ బాక్స్’ నంబరు మాత్రమే ఇచ్చిన ఒక గ్రామానికి సంబంధించిన వివరాలు తెలుసుకోమని అడిగాడు. నేను ఎలాగైనా ఆ పిల్లవాడికి సహాయపడాలనుకున్నాను. ప్రపంచం అంతా నిజాయితీతో నిండి లేదు. ఎక్కడైనా వివక్ష తప్పదని ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పాను’’ అన్నారు ఆమె. ఫ్యూయింగ్ సహాయంతో, ఖాన్ ఒక విషయం తెలుసుకున్నారు... ఇంగ్లండ్‌లో చదవడం చాలా ఖర్చుతో కూడిన పని మాత్రమే కాదు, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుందనీ, వాటిని తాను చాలా చాకచక్యంతో ఎదుర్కోవాలనీ. వారిద్దరి మధ్య నడిచిన అనేక చర్చల తరువాత, అతడు ఫిలిప్పీన్స్‌లో మెడిక ల్ డిగ్రీ చదవడానికి నిశ్చయించుకున్నాడు. అలా కంప్యూటర్ చాటింగ్ ద్వారా ఖాన్ మెడికల్ కాలేజీలో చేరి డాక్టరయ్యాడు.