బావిలో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు: బావిలో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవాలెం గ్రామానికి చెందిన గంజి మురళి(50) గ్రామంలో ఉన్న చెదబావిలో పడి మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన మురళి కనిపించకపోవడంతో బెంగపెట్టుకున్న కుటుంబసభ్యులు అతని కోసం వెతకులాట ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న బావిలో మృతదేహం పైకి తేలడంతో పోలీసులకు సమాచారం అందిచారు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు. మృతికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(నగరం)