గీత స్మరణం | Song from Bangaru Kalalu | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Sun, Nov 17 2013 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి :
 
 పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి...     (2)
 నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి
 పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి...
 
 చరణం : 1
 
 కళకళలాడే నీ కళ్లు దేవుడి ఇళ్లమ్మా
 కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా
 ॥
 నీ కోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి
 ॥
 
 చరణం : 2
 
 ఆటలలో చదువులలో మేటిగ రావాలి
 మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి
 ॥
 చీకటి హృదయంలో వెన్నెల కాయాలి
 నా బంగారుకలలే నిజమై నిలవాలి
 ॥
 
 చరణం : 3
 
 నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాథుడు కావాలి     (2)
 నీ సంసారం పూలనావలా సాగిపోవాలి
 నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి
 నిన్నే తలచి నే పొంగిపోవాలి
 ॥
 
 చిత్రం: బంగారు కలలు (1974), రచన: దాశరథి
 సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, గానం: పి.సుశీల

 
 నిర్వహణ: నాగేశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement