గీత స్మరణం | Today Song | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Mon, Dec 2 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి :


 ఓహో ఓహో...
 ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా    (2)
 మావారి అందాలు నీవైన తెలుపుమా    (2)
 ॥ఓహో॥
 
 చరణం : 1


 మనసు మధురమైనది మమతలు నిండినది
 సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది    ॥
 అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా?    (2)
 కరవుతీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ    ॥ఓహో॥
 
 చరణం : 2


 వలపుకన్న తీయని పలుకులు వారివి
 తలచుకున్న చాలును పులకరించు నా మేను
 ॥
 మగసిరి దొరయని మరునికి సరియని     (2)
 అందరు అందురే అంత అందమైనవారా
 ఓహో ఓహో॥


 చరణం: 3


 అందరి కన్నులు అయ్యగారి మీదనే
 దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు
 ॥
 అన్నది నిజమేనా అల్లిన కథలేనా     (2)
 కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా    ఓహో ఓహో॥
 
 చిత్రం: వుంచివునసులు (1962)
 రచన: ఆచార్య ఆత్రేయ
 సంగీతం: కె.వి.వుహదేవన్, గానం: ఎస్.జానకి

 
 నిర్వహణ: నాగేశ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement