గీత స్మరణం
పల్లవి :
ఓహో ఓహో...
ఓహో ఓహో పావురమా... వయ్యారి పావురమా (2)
మావారి అందాలు నీవైన తెలుపుమా (2)
॥ఓహో॥
చరణం : 1
మనసు మధురమైనది మమతలు నిండినది
సొగసు నేనెరుగనిది చూడాలని ఉన్నది ॥
అరువుగ నీ కనులు కరుణతో ఇవ్వగలవా? (2)
కరవుతీర ఒక్కసారి కాంతునమ్మ వారినీ ॥ఓహో॥
చరణం : 2
వలపుకన్న తీయని పలుకులు వారివి
తలచుకున్న చాలును పులకరించు నా మేను
॥
మగసిరి దొరయని మరునికి సరియని (2)
అందరు అందురే అంత అందమైనవారా
ఓహో ఓహో॥
చరణం: 3
అందరి కన్నులు అయ్యగారి మీదనే
దిష్టి తగలగలదనీ తెలిపిరమ్మ కొందరు
॥
అన్నది నిజమేనా అల్లిన కథలేనా (2)
కన్నులున్న నీవైనా ఉన్నమాట చెప్పుమా ఓహో ఓహో॥
చిత్రం: వుంచివునసులు (1962)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: కె.వి.వుహదేవన్, గానం: ఎస్.జానకి
నిర్వహణ: నాగేశ్