నగేష్‌ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ | Trial Of Medak Additional Collector Nagesh Case Continued 3rd Day | Sakshi
Sakshi News home page

నగేష్‌ కేసు; మూడవ రోజు ముగిసిన నిందితుల కస్టడీ

Published Wed, Sep 23 2020 7:19 PM | Last Updated on Wed, Sep 23 2020 7:34 PM

Trial Of Medak Additional Collector Nagesh Case Continued 3rd Day - Sakshi

సాక్షి, మెదక్ : మెదక్‌ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై మూడో రోజు అవినితి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ క‌స్ట‌డీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. మూడవ రోజు నగేష్ బినామిలను ఏసీబీ విచారించింది. నగేష్ బినామిలో కీలక పాత్ర పోషించిన ఓ మహిళ బినామిని విచారించగా, మెదక్, మనోహర బాద్, మేడ్చల్, కామారెడ్డిలో పలు అక్రమాలను ఏసీబీ గుర్తించింది. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగుల సైతం ఏసీబీ అధికారులు విచారించారు. నగేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్‌ కీ కోసం బ్యాంక్ అధికారులతో డూప్లికేట్ కీ చేయించి రేపు ఓపెన్ చేయించనున్నారు. (మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు)

లాకర్ ఓపెన్ చేస్తే మరిన్ని వివరాకు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. అయితే ఈ కేసుతో తనకు ఏలాంటి సంబంధం లేదని అడిషనల్ కలెక్టర్ విచారణలో తెలిపారు. కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్‌లో ఉన్న తను అవినీతికి  పాల్పడలేదని పేర్కొన్నారు. దీంతో ఆడియో టేపులు ,అగ్రిమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను ముందుంచి నగేన్‌ అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా రేపటితో  నిందితుల కస్టడీ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రేపు మరోసారి పలువురు అనుమానితులను, సాక్ష్యులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (ఏసీబీ అధికారుల‌ను బుకాయించే ప్ర‌య‌త్నం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement