అడిషనల్‌ కలెక్టర్‌ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్‌ | Crime News: ACB Files Petition On Medak Additional Collector Case In High Court | Sakshi
Sakshi News home page

అడిషనల్‌ కలెక్టర్‌ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్‌

Published Mon, Sep 14 2020 3:40 PM | Last Updated on Mon, Sep 14 2020 3:55 PM

Crime News: ACB Files Petition On Medak Additional Collector Case In High Court  - Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లా‌ అడిషనల్‌ కలెక్టర్‌ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్‌ 1.12 ​కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసులో నగేష్‌తో పాటు మరో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ ఏసీబీ సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. (చదవండి: ‘లాకర్‌’ గుట్టు వీడేనా..!)

నగేష్‌తో పాటు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతించాల్సిందిగా ఏసీపీ కోర్టును కోరింది. నిందితులను కస్టడీకి తీసుకోవడం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పిటిషన్‌తో పేర్కొంది. మాజీ కలెక్టర్‌ పాత్రపై కూడా ఏసీబీ  ఆరా తీస్తోంది. అంతేగాక స్టాంప్‌ అండ్‌ రీజిస్టేషన్‌కు మాజీ కలెక్టర్‌ రాసిన లేఖ ద్వారా ఈ కేసులో మాజీ కలెక్టర్‌ పాత్రపై వివరాలు సెకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement