Anti Corruption Department officials
-
అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్
సాక్షి, మెదక్: జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ 1.12 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసులో నగేష్‌తో పాటు మరో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ ఏసీబీ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. (చదవండి: ‘లాకర్’ గుట్టు వీడేనా..!) నగేష్‌తో పాటు నలుగురు నిందితులను 5 రోజుల కస్టడీకి అనుమతించాల్సిందిగా ఏసీపీ కోర్టును కోరింది. నిందితులను కస్టడీకి తీసుకోవడం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పిటిషన్‌తో పేర్కొంది. మాజీ కలెక్టర్ పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తోంది. అంతేగాక స్టాంప్ అండ్ రీజిస్టేషన్‌కు మాజీ కలెక్టర్ రాసిన లేఖ ద్వారా ఈ కేసులో మాజీ కలెక్టర్ పాత్రపై వివరాలు సెకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
‘లాకర్’ గుట్టు వీడేనా..!
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్ కేసు దర్యాప్తులో వేగం పెంచేందుకు అవినీతి నిరోధక శాఖ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఏసీ నగేశ్‌కు రూ.40 లక్షలు ముట్టినట్లు ఆడియో రికార్డులు లభ్యం కాగా.. మిగతా రూ.72 లక్షలకు బినామీ జీవన్‌గౌడ్ పేరిట అగ్రిమెంట్ పత్రా లు దొరికిన విషయం తెలిసిందే. మరిన్ని ఆధారాల కోసం ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో దాల సమయంలో లాకర్ కీ లేదని అదనపు కలెక్టర్ మొండికేసినట్లు తెలిసింది. దీంతో అధికారులు బోయిన్‌పల్లిలోని ఓ బ్యాంకులో లాకర్, మాచవరంలోని ఇంట్లో బీరువా తెరవలేకపోయారు. బినామీలు, వారి ఖాతాలపై నజర్ సోదాల్లో పలు కీలక పత్రాలు లభించగా.. మరికొందరు వ్యక్తులు ఏసీ బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిపై ఇప్పటికే నిఘాపెట్టారు. ఏసీబీ సోదాలు ప్రారంభమైనప్పటి నుంచి అదనపు కలెక్టర్‌తో సన్నిహితంగా ఉండే కార్యాలయ ఉద్యోగులు కొందరు పత్తా లేకుండా పోయారు. వీరితోపాటు జిల్లాలో భూవ్యవహారాల్లో తలదూర్చిన మరికొందరు వ్యక్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు. రియల్టర్‌పై నజర్.. మెదక్ జిల్లాలో రెండు చోట్ల విద్యాసంస్థలు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి.., అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు భూవ్యవహారాల్లో ఏసీకి అన్నీ తామై కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. వీరు హైదరాబాద్ కేంద్రంగా తతంగం నడిపించినట్లు గుర్తించారు. వీరిని సైతం ఏసీబీ త్వరలో విచారించనున్నట్లు తెలిసింది. లాకర్, బీరువా తెరిచేందుకు సన్నాహాలు ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నగేశ్‌ను ఏసీబీ అధికారులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. సోదాల సమయంలో అదనపు కలెక్టర్ దంపతులు అధికారులకు సహకరించకుండా బ్యాంక్ లాకర్, బీరువా తాళం చెవులు లేవంటూ మొండికేశారు. దీంతో కోర్టు ఆదేశాలతో వీటిని తెరిచేందుకు అనుమతులు పొందినట్లు తెలుస్తోంది. వీటిని తెరిస్తే నగదు, బినామీల బాగోతం వెలుగుచూడొచ్చని అధికారులు భావిస్తున్నారు. త్వరలో మాజీ కలెక్టర్‌కు నోటీసులు చిప్పల్తుర్తి భూములకు సంబంధించి 112 ఎకరాలను నిషేధిత భూముల జాబితా 22–ఏ నుంచి తొలగించాలని రిజిస్ట్రేషన్ శాఖకు మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి లేఖ రాసినట్లు వెలుగులోకి రావడం కలకలం సృష్టించింది. ఈ మేరకు ఆయనను విచారించేందుకు ఏసీబీ అధికారులు అన్నీ సిద్ధం చేసినట్లు సమాచారం. ఆయనకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ కేసులో పట్టుబడిన ఆర్డీఓ అరుణారెడ్డి ఏసీబీకి కీలక సమాచారం ఇవ్వడంతో అధికారులు దూకుడుగా ముం దుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. -
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన షమీ భార్య!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై వ్యక్తిగత ఆరోపణ (వివాహేతర సంబంధాలు, గృహహింస)లతో పాటు, కెరీర్‌కు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. కానీ బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను విచారణ చేపట్టిన నేపథ్యంలో క్రికెటర్ భార్య యూటర్న్ తీసుకున్నారు. విచారణలో భాగంగా హసీన్ జహాన్‌ను శనివారం సాయంత్రం అధికారులు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో తడబాటుకు లోనవుతూ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండటం తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త షమీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు హసీన్ జహాన్. ఇంగ్లండ్‌కు చెందిన మమ్మద్ బాయ్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్‌కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పానన్నది సారాంశం. తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. షమీ కెరీర్ కు ఏ ఇబ్బంది లేదంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, నగదు అంశంపై షమీ, అతడి భార్య హసీన్ జహాన్ ఫోన్లో మాట్లాడుతూ గొడవపడ్డట్లు ఆడియో టేపుల్లో గుర్తించినట్లు బీసీసీఐ అవినీతీ నిరోధకశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు షమీని అధికారులు ఆదివారం విచారించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి నివేదికను బీసీసీఐకి ఇవ్వనున్నారు. షమీ క్రికెట్ భవితవ్యం ఆ నివేదికపై ఆధారపడి ఉంటుంది. -
క్రికెటర్ షమీని ప్రశ్నిస్తున్న పోలీసులు
సాక్షి, స్పోర్ట్స్: టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం షమీ భార్యను ఈ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. నలుగురు అధికారులు షమీ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా.. ఆమె తడబడుతూ వారికి సమాధానమిచ్చారు. ఈ క్రమంలో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం ఆదివారం అమ్రోహలోని పేసర్ షమీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం క్రికెటర్ ఇంటికి చేరుకున్న అవినీతిశాఖ అధికారులు షమీని, కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. షమీ ప్రవర్తన, అతడు ఎలా ఉండేవాడు అతడికి సంబంధించిన వ్యక్తిగత అంశాలపై కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. షమీకి చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, తనపై వేధింపులకు పాల్పడ్డాడని హసీన్ జహాన్ ఆరోపించారు. దాంతో పాటుగా పాకిస్తాన్ మహిళతో నగదు తీసుకుని క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్సింగ్ చేశాడంటూ కీలకమైన ఆరోపణలు చేసిన ఆడియో టేపులను అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. హసీన్ నా మాజీ భార్య అంటూ, ఆమెతో తనకు ఇద్దరు పిల్లలు పుట్టారంటూ ఓ వ్యక్తి బయటకు రావడంతో షమీ భార్య కాస్త తగ్గినట్లు కనిపించారు. షమీ భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశానుసారం బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు విచారణ చేపట్టారు. వారంలో రోజుల్లోగా దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని గడువు ఇచ్చారు. అధికారుల నివేదిక మీద షమీ క్రికెట్ కెరీర్ (భవిష్యత్తు) ఆధారపడి ఉంటుంది. మరోవైపు భార్య తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనకు మరణశిక్ష విధించాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ప్రశ్నలతో షమీ భార్య ఉక్కిరి బిక్కిరి
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి పెను కలకలమే రేపింది అతని భార్య హసిన్ జహాన్. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ కమిటీ ఆదేశాలానుసారం రంగంలోకి దిగిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగ అధికారులు.. హసిన్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేశారు. శనివారం సాయంత్రం కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న నలుగురు అధికారులు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు. అంతకు ముందు ఆమె చేసిన ఆరోపణలపై ఆమెకు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక విచారణలో ఆమె చేసిన ప్రధాన ఆరోపణలు.. ఆమె ఆ విషయాలు ఎలా తెలుసన్న కోణంలోనే మూడు గంటలపాటు ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. వాటిలో చాలా వరకు ఆమె తడబడటం, మౌనంగా ఉండటంతో మరోసారి ఆమెను ప్రశ్నించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన అలిషబా అనే యువతి నుంచి డబ్బులు తీసుకుని షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని. దీని వెనుక ఇంగ్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త మహమ్మద్ భాయ్ ఉన్నాడంటూ జహాన్ ఆరోపించారు. ఇక ప్రస్తుత దర్యాప్తు అనంతరం అధికారులు ఇచ్చే రిపోర్ట్‌పైనే షమీ క్రికెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే హసీన్ తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే తనను ఉరి తీయాలంటూ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకేం పాపం తెలీదని.. ఈ వ్యవహారంలో తనకు సాయం చేయాలని బీసీసీఐని షమీ వేడుకున్నాడు. సోదరుడితో షమీ రేప్ చేయించబోయాడు -
గాంధీ ఆస్పత్రిలో ఏసీబీ దాడులు
- పట్టుబడ్డ అడిషనల్ డెరైక్టర్ రమేశ్‌బాబు - సెక్యూరిటీ బిల్లులు చెల్లించేందుకు రూ.40 వేలు డిమాండ్ హైదరాబాద్: సెక్యూరిటీ సంస్థకు చెందిన బకాయి బిల్లులు చెల్లించేందుకు లంచం తీసుకున్న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అడిషనల్ డెరైక్టర్ ఎన్వీ రమేశ్‌బాబును అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న రూ. 20 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ ఆస్పత్రిలో శ్రీసాయి సెక్యూరిటీ సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిని 96 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. సదరు సంస్థకు ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల బిల్లులు ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. బకాయి బిల్లులు మంజూరయ్యేలా చూడమని శ్రీసాయి సెక్యూరిటీ సంస్థ ఎండీ డీ. శ్రీకాంత్ కోరారు. రూ.44 లక్షల బకాయి బిల్లులను మంజూరు చేసేందుకు తనకు రూ. 40 వేలు ఇవ్వాలని రమేశ్‌బాబు డిమాండ్ చేశారు. అప్పటికి సరేనని.. ముందు రూ.20 వేలు.. బిల్లులు మంజూరు అయిన తర్వాత మిగతా సొమ్ము ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈనెల 27న శ్రీకాంత్ అవినీతి నిరోధక శాఖ అధికారులను కలసి పరిస్థితి వివరించాడు. దీంతో అధికారులు పకడ్భందీగా వలపన్ని కొన్ని నోట్లను శ్రీకాంత్‌కు ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం గాంధీ కళాశాల క్రీడామైదానం వద్దకు చేరుకున్న ఏడీ రమేశ్‌బాబు.. శ్రీకాంత్ నుంచి సొమ్ము తీసుకుని వెళ్లిపోయాడు. కార్యాలయంలోకి వెళ్లి భోజనం చేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఏడీ జేబులు సోదా చేశారు. తాము రసాయనాలు కలిపి ఇచ్చిన రూ. 20 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏడీ, అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లోని రికార్డు పుస్తకాలను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్‌తోపాటు ఐదుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ దాడుల్లో పాల్గొన్నారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఏడీగా విధులు నిర్వహించిన రమేష్‌బాబు 2013 మే 15న గాంధీ ఆస్పత్రి ఏడీగా పదవీబాధ్యతలు చేపట్టాడు.