కోలీవుడ్‌కు మరో వారసుడు | Nagesh's grandson debuts in Kalkandu | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌కు మరో వారసుడు

Published Mon, Jul 21 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

కోలీవుడ్‌కు మరో వారసుడు

కోలీవుడ్‌కు మరో వారసుడు

 ప్రస్తుతం కోలీవుడ్‌ను ఏలుతున్న వారిలో వారసులే అధికం. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వారసులుగా ఆయన ఇద్దరు కూతుళ్లు (ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ అశ్విన్) దర్శకత్వంలో రాణిస్తున్నారు. పద్మభూషణ్ వారసురాలు శ్రుతిహాసన్, క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. రెండో కూతురు అక్షర కూడా హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక నటుడు శివకుమార్ వారసులు సూర్య, కార్తీ సూపర్ హీరోలుగా ప్రకాశిస్తున్నారు. శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి హీరోయిన్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.
 
 ప్రభు తనయుడు, దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు విక్రమ్ ప్రభు యువ హీరోగా దూసుకుపోతున్నారు. అలాగే మురళి కొడుకు అధర్వ, కార్తీక్ వారసుడు గౌతమ్ కార్తీక్, భాగ్యరాజ్ కొడుకు శాంతను, పాండియరాజన్ కొడుకు పృథ్వి తండ్రుల పేరు కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా దివంగత హాస్య శిఖామణి నాగేష్ మనవడు, ఆనంద్‌బాబు తనయుడు గజేష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి కల్‌కండు అనే టైటిల్‌ను నిర్ణయించారు.యారడా మహేశ్ చిత్రం ఫేమ్ డింపుల్ శోబాడే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
 ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ మ్యూజిక్‌ను రీక్రియేట్ చేసే నటుడు తన చిత్రంలో హీరోగా నటించాలని భావించనున్నారు. గతంలో తన చిత్రాల్లో దివంగత నటుడు నాగేష్ నటించారని గుర్తు చేశారు. ఆయన మనవడు కూడా నటించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలియడంతో ఆయనతోపాటు కుటుంబ సభ్యులందరికీ కథ వినిపించి గజేష్‌ను ఎలా ప్రజెంట్ చేయనున్నది వివరించానన్నారు. చిత్రకథ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఆగస్టు చివరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement