టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల గుడ్ బై, టీఆర్ఎస్ లో రేపు చేరిక
Published Sun, Mar 2 2014 1:22 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో రాజీనామా పర్వం కొనసాగుతునే ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సత్యవతి రాధోడ్, నగేశ్ లు రాజీనామాలు సమర్పించి సోమవారం టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆపార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. సత్యవతి రాథోడ్, నగేశ్ లే కాకుండా మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యవతి రాథోడ్ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే మరో ఎమ్మెల్యే నగేశ్ కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉండగా, రేపు మధ్నాహ్నం 3 గంటలకు పార్టీ ప్రధానకార్యాలయం తెలంగాణ భవన్ లో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా? లేదా పార్టీని విలీనం చేయాలా అనే అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారని పార్టీకి చెందిన నేతలు వెల్లడించారు.
Advertisement
Advertisement