స్కానియా మెట్రోలింక్ కోచ్‌లు | IAB Report – Scania delivers first Metrolink bus in Chennai; inaugurates dealership | Sakshi
Sakshi News home page

స్కానియా మెట్రోలింక్ కోచ్‌లు

Published Thu, Jul 17 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

స్కానియా మెట్రోలింక్ కోచ్‌లు

స్కానియా మెట్రోలింక్ కోచ్‌లు

కొరుక్కుపేట: హెవీ వెహికల్స్, ట్రావెల్ బస్సులను తయూరు చేయడంలో పేరుపొందిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌లను అందుబాటులోకి తెచ్చిం ది.  మొదటగా ప్రవేశపెట్టిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌ను చెన్నైలోని పర్వీన్ ట్రావెల్స్‌కు అందజేసినట్లు స్కానియా ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఆండర్స్ గ్రుండ్ స్టోమర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో స్కానియా మెట్రోలింగ్ కోచ్‌ల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆండర్స్ మాట్లాడుతూ, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణికుల భద్రత ప్రధానంగా చేసుకుని అల్ట్రా లగ్జరీ ఫ్యూచర్‌లు, సౌకర్యం, సేఫ్టీ ప్రొవిజన్‌తో ఈ కోచ్‌లను ప్రత్యేకంగా డిజైన్ చేశామన్నారు.

ఫ్యూయల్ ఎఫిషియన్సీతో కూడిన ఈ హైవే బస్సులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. చెన్నై - కొచ్చి మధ్య నడుపుతున్న పర్వీన్ ట్రావెల్స్‌కు ఐఎస్‌వో గుర్తింపు పొందటం సంతోషంగా ఉందన్నారు. మొదటగా తాము ప్రవేశపెట్టిన స్కానియా మెట్రోలింక్ కోచ్‌లను పర్వీన్ ట్రావెల్స్‌కు అందించటం ఆనందంగా ఉందన్నారు. ఈ బస్సు 85 కిలోమీటర్ల వేగంతో చేరవలసిన గమ్యస్థానానికి నిర్ణీత సమయంలోపే వెళ్లే సౌకర్యం ఉందని అన్నారు. ఆరు ఎమర్జెన్సీ డోర్‌లు, మానిటర్ డ్రైవర్ మూమెంట్స్, ప్రయాణికులకు సేఫ్టీ వీడియోలు తదితర సౌకర్యాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కానియా కమర్షియల్ వెహికల్స్ లిమిటెడ్ సేల్స్ డెరైక్టర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement