Published
Sun, Nov 24 2013 1:19 AM
| Last Updated on Mon, Sep 17 2018 5:32 PM
రాజకీయ నేపథ్యంలో...
ప్రస్తుత రాజకీయ పరిణామాలు సగటు మనిషి జీవితాన్ని ఏ విధంగా మారుస్తున్నాయి? అనే కథాంశంతో సుధా మూవీస్ పతాకంపై గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో జె.సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతినిధి’. నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప హీరో హీరోయిన్లు. ప్రశాంత్ మండవ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ పాటలు స్వరపరిచారు. ఇటీవల విడుదలైన ఈ పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత చెబుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. ఈ నెలాఖరున లేక వచ్చే నెల మొదటి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. టైటిల్ రోల్‌ని నారా రోహిత్ అద్భుతంగా చేశారు. పాటలతో పాటు ప్రచార చిత్రానికి కూడా విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ప్రచార చిత్రాన్ని యూ ట్యూబ్‌లో ఐదు లక్షల మంది వీక్షించారు. కొత్త దర్శకుడైనా ప్రశాంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని చెప్పారు.