'అధికారం కోసం దేశాన్ని శ్మశానం చేస్తార్రా?'
Published Tue, Nov 12 2013 11:00 AM | Last Updated on Wed, Aug 29 2018 3:53 PM
'అధికారం... అధికారం.. అధికారం
ఎముందురా అందులో
చుట్టూ పదిమంది సెక్యూరిటీ
ఉదయాన్నే లేస్తే ఇంటి చుట్టూ వంద మంది కార్యకర్తలు
సొసైటీలో పలుకుబడి.. తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్ధత
మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్లిపోతారు.
దీని కోసం దేశాన్ని శ్మశానం చేస్తార్రా?'
తాజాగా నారా రోహిత్ నటిస్తున్న ప్రతినిధి సంబంధించిన టీజర్ లోని డైలాగ్స్.. ఈ టీజర్ లో రాజకీయ నాయకులపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు. అయితే నారా రోహిత్ కూడా రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే.. రోహిత్ పెదనాన్న చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. తండ్రి నారా రామ్మూర్తినాయుడు ఒకప్పుడు ఎమ్మెల్యేనే. ఇలాంటి నేపథ్యం ఉన్న నారా రోహిత్ రాజకీయ నాయకులపై సెటైర్లు విసరడం టీజర్ లో కొంత ఆసక్తిని కలిగించింది.
అయితే నవంబర్ 13 తేదిన ఆడియో రిలీజ్ చేయనున్నట్టు నారా రోహిత్ ట్విట్ చేశాడు. ఆ కార్యక్రమానికి ఆయన పెదనాన్న చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధి.
తన చిత్రం ద్వారా రాజకీయాలను కడిగిపారేయాలనుకున్న ఈ హీరో..మరో రాజకీయ నాయకుడి ద్వారా సినిమా ఆడియో రిలీజ్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రేక్షకుల ప్రశ్న. ఒకవేళ బ్రష్టుపట్టిన రాజకీయాలను టార్గెట్ చేయానుకుంటే.. ఎవరైనా సమాజిక కార్యకర్తతోనో లేక ఓ స్వతంత్ర సమరయోధుడి చేతనో ఆడియో విడుదల చేస్తే. నారా రోహిత్ విడుదల చేసిన టీజర్ కు కొంత గుర్తింపు.. అనుకున్న ప్రమోషన్ సాధించవాడేమో..టీజర్ లో చెప్పేది ఒకటి.. ఆచరణలో మరొకటి...ఏమైనా ఉగ్గుపాలతోనే రాజకీయాలను ఒంటపట్టించుకున్న నారా రోహిత్ కు ఇది మినహాయింపే అనుకుందాం!
Advertisement
Advertisement