
‘ప్రతినిధి’గా నారా రోహిత్
‘‘ఎన్టీఆర్ యుగపురుషుడు... కారణజన్ముడు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటే ఏ రంగంలో అయినా రాణించవచ్చు. అందుకే యువతరం ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి’’ అన్నారు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు. నారా రోహిత్ హీరోగా గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో సుధా సినిమాస్ పతాకంపై జె. సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతినిధి’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో వేడు కలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు సీడీని ఆవిష్కరించి పరుచూరి గోపాలకృష్ణకు అందజేసిన అనంతరం మాట్లాడుతూ -‘‘ఈ టైటిల్ చాలా ఎమోషనల్‌గా, ఇన్‌స్పిరేషన్‌గా ఉంది.
బాణం, సోలో తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ మరో మెట్టు పైకి ఎక్కాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుత పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని, సామాజిక బాధ్యతతో ఈ సినిమా చేశామని నారా రోహిత్ అన్నారు. చిత్రబృందంతో పాటు పలువురు అతిథులు ఈ వేడుకలో పాల్గొన్నారు.