
మళ్లీ కోలీవుడ్‌లో పాగా
హీరోయిన్ల లక్ ఏమిటంటే ఒక భాషలో అవకాశాలు ముఖం చాటేస్తే మరో భాషలో ఆహ్వానం పలుకుతుంటాయి. అలా ఒక భాషలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకున్న తారలు
హీరోయిన్ల లక్ ఏమిటంటే ఒక భాషలో అవకాశాలు ముఖం చాటేస్తే మరో భాషలో ఆహ్వానం పలుకుతుంటాయి. అలా ఒక భాషలో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకున్న తారలు ఇతర భాషల్లో జయించి మళ్లీ ఎక్కడ ఓడారో అక్కడే గెలుస్తారు. అనుష్క, ఇలియానా, తమన్నా ఇలా ఈ లిస్ట్‌లో చాలా మంది తారలున్నారు. తమన్నా విషయానికే వస్తే కోలీవుడ్‌లో కేడీ చిత్రం ద్వారా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంతో పాటు మరికొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. ఆ తర్వాత తెలుగులో హ్యాపీడేస్ చిత్రంతో విజయాల ఖాతా ఓపెన్ అయ్యింది. దీంతో మళ్లీ కోలీవుడ్ ఆహ్వానించింది.
ఇక్కడ సక్సెక్ సాధించింది. ఆ తర్వాత మళ్లీ కొంచెం గ్యాప్ తరువాత తెలుగులో మంచి అవకాశాలు వచ్చారుు. అక్కడ కొన్ని విజయాలను అందుకుంది. తాజాగా టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు కోలీవుడ్ ఆదుకుంటోంది. తమిళంలో ప్రస్తుతం ప్రశాంత్ సరసన సాహసం చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా తమన్నాను మరో అవకాశం వరించింది. హీరోయిన్లకు ఇష్టసఖుడిగా గుర్తింపు పొందిన ఆర్యతో రొమాన్స్ చెయ్యడానికి తమన్నా సిద్ధం అవుతోంది. ఎం.రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఇందులో హాస్య నటుడు సంతానం ముఖ్య భూమికను పోషించనున్నారు. ఆ విధంగా తమన్నా కోలీవుడ్‌లో మళ్లీ పాగా వేస్తోంది.