ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన..
బంజారాహిల్స్: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ బస్తీలో నివసించే కోడేటి ప్రశాంత్(22) డ్రైవర్. బస్తీకి చెందిన బాలిక(15)ను ప్రేమిస్తున్నానని నమ్మించాడు.
పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.