
ప్రతీకాత్మక చిత్రం
పెనమలూరు(కృష్ణా జిల్లా): బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన బాలుడు ఆమె పై లైంగిక దాడి చేయటంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప కార్మికనగర్‌కు చెందిన బాలిక (17) విజయవాడలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న సమయంలో పునాదిపాడుకు చెందిన బాలుడి(17)తో పరిచయం ప్రేమగా మారింది.
చదవండి: ప్రియునితో సహజీవనం.. వారిమధ్య ఏం జరిగిందో గానీ..
అయితే బాలుడు ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఈ నెల 16వ తేదీన బాలుడు బాలికను పోరంకిలో ఓ ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రవర్తన పై తల్లిదండ్రులకు అనుమానం రావటంతో ఆరా తీయగా.. జరిగిన విషయం బాలిక చెప్పింది. దీంతో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment