హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట చేపట్టాయి. అందులోభాగంగా గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు కళాశాలల బంద్కు సదరు యాజమాన్యం పిలుపు నిచ్చింది.
ఫీజు రియింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడం వల్ల కాలేజీల్లో సిబ్బందికి జీతాలు చెల్లించలేక పోతున్నామని కాలేజీల యాజమాన్యం ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో కాలేజీల బంద్ పాటించక తప్పడం లేదని కాలేజీల యాజమాన్యం ప్రకటించింది.