తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు రేపటి నుంచి నిరవధిక బంద్ పాటించనున్నట్టు విద్యా సంస్థల జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. విద్యా సంస్థలపై పోలీసు, విజిలెన్స్ దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఈ నెల 30వ తేదీలోపు ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. విద్యా శాఖ అధికారులతోనే తనిఖీ చేయించాలని, లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి ఏడాది సమయం ఇవ్వాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.
రేపటి నుంచి ప్రైవేటు విద్యా సంస్థల బంద్
Published Sun, Apr 17 2016 4:08 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement