ఉన్నత విద్యా మండలి తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలను అనుమతించాలా వద్దా అన్న అంశంపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించింది. ప్రస్తుతం ఎన్ని మండలాల్లో డిగ్రీ కాలేజీల సంఖ్య, ఎన్ని కాలేజీలను ఏర్పాటు చేయొచ్చన్న అంశాన్ని తేల్చింది. అయితే జూనియర్ కాలేజీల సంఖ్య, వాటిల్లోని విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణత శాతాన్ని బట్టి ఇవ్వాలా.. లేదా డిగ్రీ కాలేజీలు అసలే లేని మండలాల్లో అనుమతించాలా అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఉన్నత విద్యా మండలికి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆ తరువాతే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 461 మండలాలు ఉండగా అందులో 324 మండలాల్లో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 137 మండలాల్లో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు లేవని తేలింది.
ప్రైవేటు డిగ్రీ కాలేజీలను అనుమతించాలా.. వద్దా?
Published Tue, Jan 19 2016 4:20 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement