ముగిసిన పీజీ ‘వైద్య’ కౌన్సెలింగ్‌ | Ended the PG 'Medical' Counseling | Sakshi
Sakshi News home page

ముగిసిన పీజీ ‘వైద్య’ కౌన్సెలింగ్‌

Published Sun, May 14 2017 1:02 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

ముగిసిన పీజీ ‘వైద్య’ కౌన్సెలింగ్‌ - Sakshi

ముగిసిన పీజీ ‘వైద్య’ కౌన్సెలింగ్‌

- ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లకూ విద్యార్థుల ఆప్షన్లు
- యాజమాన్యాల వైఖరితో అర్హుల జాబితా తయారీ ఆలస్యం..?
- సర్కారు నిర్ణయం కోసం ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు    
- రేపు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న ప్రైవేటు కాలేజీలు


సాక్షి, హైదరాబాద్‌: పీజీ వైద్య సీట్లకు నిర్వహించిన వెబ్‌ కౌన్సెలింగ్‌ శనివారం ముగిసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన ప్రభుత్వ మెడికల్‌ కాలే జీ సీట్లకు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలోని కన్వీనర్‌ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ శుక్ర, శనివా రాల్లో జరిగింది. మైనారిటీ కాలేజీ సీట్లకు మొదటి వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 267 కన్వీనర్‌ కోటా సీట్లకు, మైనారిటీలోని 46 కన్వీనర్‌ కోటా సీట్లకు, కొత్తగా కేటాయిం చిన 100 సీట్లకు, మొదటి కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన 51 నిమ్స్‌ సీట్లకు, ఓయూ, గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో మిగిలిన 236 సీట్లకు విద్యార్థులు తమ ఆప్షన్లు ఇచ్చారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్‌ జరిగినా వాటికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా ప్రకటన ఆలస్యమయ్యే సూచనలున్నాయి.

ప్రైవేటు పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టేను ఎత్తివేయాలని యాజ మాన్యాలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించడంతో గందరగోళం నెలకొంది. తమ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనిపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ లేఖ రాయడంతో సర్కారు నిర్ణయం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

రేపు హైకోర్టులో పిటిషన్‌
ఫీజుల పెంపు జీవోపై విధించిన స్టేను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజ మాన్యాలు నిర్ణయించాయి. ఈ నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున అత్యవసర అం శంగా పరిగణించాలని కోరనున్నాయి. హైకోర్టు స్టేను ఎత్తివేయకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫీజుల పెంపుపై రాద్ధాంతం చేస్తున్నారని, ఈసారి నుంచి పీజీ విద్యార్థులకు స్టైఫండ్‌ ఇవ్వాల్సి ఉన్నందున తమకు పెద్దగా ఫీజులు పెరగలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజుల పెంపు లేకుంటే వాటిని నిర్వహించడం సాధ్యం కాదని చెబు తున్నాయి.

ఫీజు పెంపును అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించింది పరోక్షంగా ఇద్దరు ఉన్నతాధికారులేనని ఆరోపిస్తున్నాయి. నెలాఖరుకు అడ్మిషన్లు పూర్తికాకపోతే అది ప్రభుత్వ బాధ్యతేనని అంటున్నాయి. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మధ్య ఈ వ్యవహారం వివాదాన్ని సృష్టించింది. పెంపుపై ప్రభుత్వం అనుకూలమైనా.. కొందరు అధికారులు వ్యతిరేకిస్తున్నారని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement