
అర్హత ఉన్న కాలేజీలకు అనుమతి
హైదరాబాద్: అర్హత ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ఎంసెట్ వెబ్‌కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రైవేటు కాలేజీలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీంతో అర్హత ఉన్న కాలేజీలకు ఊరట లభించింది. నిబంధనలు సక్రమంగా పాటించడంలేదని తెలంగాణ ప్రభుత్వం కొన్ని కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
దాంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఏఐసిటిఇ ప్రమాణాలు పాటిస్తున్న కాలేజీలను వెబ్‌కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయా కాలేజీలు ప్రమాణాలు పాటించినట్లు జెఎన్టియు ధృవీకరించాలని హైకోర్టు తెలిపింది.