ఫీజుల నియంత్రణపై హైకోర్టులో పిల్
Published Tue, Apr 25 2017 4:11 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
హైదరాబాద్: ప్రైవేటు కళాశాలలో ఫీజు నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి, ఆన్ లైన్లో అడ్మిషన్స్ స్వీకరించేలా ఆదేశించాలని మేడిపల్లి సత్యం అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులు అయిన హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రెటరీకి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీకి నోటిసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం విచారిస్తామని హైకోర్టు కేసును వాయిదా వేసింది.
Advertisement
Advertisement