PG medical seat
-
పీజీ వైద్య విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం రెండో విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉన్న యాజమాన్య కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీ ల వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.knruhs.telangana.gov.inలో చూడా లని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో సూచించాయి. -
సీటొచ్చి చేరకపోతే మరొకరికి నష్టమేగా?
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీటు వచ్చాక తుది కౌన్సెలింగ్లో నచ్చిన కాలేజీలో సీటు రాలేదనో, మరే కారణంగానో సంబంధిత కాలేజీలో చేరకపోతే మరో విద్యార్థి నష్టపోతారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల సీటు కోల్పోయే ఇతర విద్యార్థుల ప్రాథమిక హక్కు దెబ్బతింటుందని అభిప్రాయపడింది. గతేడాది పీజీ మెడికల్ సీటు పొందిన కృష్ణా జిల్లాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థి నచ్చిన కాలేజీలో సీటు రాలేదని చేరలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం సదరు విద్యార్థిపై మూడేళ్ల నిషేధం విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మెడికల్ విద్యార్థి దాఖ లు చేసిన రిట్ను గురువారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం విచారించింది. సీటొచ్చాక చేరాలో లేదో విద్యార్థి ఇష్టమని, చేరకపోతే మూడేళ్లు నిషేధం విధించడం చెల్లదని, ఈ ఏడాది జరిగే పీజీ మెడికల్ కౌన్సెలింగ్, ప్రవేశాలకు పిటిషనర్ను అనుమతించాలని విద్యార్థి తరఫు న్యాయవాది వాదించారు. సీటొచ్చినా చేరకపోతే మరో విద్యార్థి ఆ సీటు పొందే హక్కు కోల్పోతారని, చేరని కారణంగా సీటుకు సంబంధించి రెండేళ్ల రుసుము చెల్లించేందుకు పిటిషనర్ సిద్ధంగా ఉన్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన పీజీ ‘వైద్య’ కౌన్సెలింగ్
- ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లకూ విద్యార్థుల ఆప్షన్లు - యాజమాన్యాల వైఖరితో అర్హుల జాబితా తయారీ ఆలస్యం..? - సర్కారు నిర్ణయం కోసం ఆరోగ్య వర్సిటీ ఎదురుచూపు - రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న ప్రైవేటు కాలేజీలు సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య సీట్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. మొదటి విడత కౌన్సెలింగ్లో మిగిలిన ప్రభుత్వ మెడికల్ కాలే జీ సీట్లకు, ప్రైవేటు మెడికల్ కాలేజీలోని కన్వీనర్ కోటా సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ శుక్ర, శనివా రాల్లో జరిగింది. మైనారిటీ కాలేజీ సీట్లకు మొదటి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 267 కన్వీనర్ కోటా సీట్లకు, మైనారిటీలోని 46 కన్వీనర్ కోటా సీట్లకు, కొత్తగా కేటాయిం చిన 100 సీట్లకు, మొదటి కౌన్సెలింగ్లో మిగిలిపోయిన 51 నిమ్స్ సీట్లకు, ఓయూ, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీల్లో మిగిలిన 236 సీట్లకు విద్యార్థులు తమ ఆప్షన్లు ఇచ్చారని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కౌన్సెలింగ్ జరిగినా వాటికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా ప్రకటన ఆలస్యమయ్యే సూచనలున్నాయి. ప్రైవేటు పీజీ వైద్య సీట్ల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే విధించడం, స్టేను ఎత్తివేయాలని యాజ మాన్యాలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించడంతో గందరగోళం నెలకొంది. తమ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీనిపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ లేఖ రాయడంతో సర్కారు నిర్ణయం కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. రేపు హైకోర్టులో పిటిషన్ ఫీజుల పెంపు జీవోపై విధించిన స్టేను నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజ మాన్యాలు నిర్ణయించాయి. ఈ నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నందున అత్యవసర అం శంగా పరిగణించాలని కోరనున్నాయి. హైకోర్టు స్టేను ఎత్తివేయకపోతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఫీజుల పెంపుపై రాద్ధాంతం చేస్తున్నారని, ఈసారి నుంచి పీజీ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాల్సి ఉన్నందున తమకు పెద్దగా ఫీజులు పెరగలేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజుల పెంపు లేకుంటే వాటిని నిర్వహించడం సాధ్యం కాదని చెబు తున్నాయి. ఫీజు పెంపును అడ్డుకునేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది పరోక్షంగా ఇద్దరు ఉన్నతాధికారులేనని ఆరోపిస్తున్నాయి. నెలాఖరుకు అడ్మిషన్లు పూర్తికాకపోతే అది ప్రభుత్వ బాధ్యతేనని అంటున్నాయి. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మధ్య ఈ వ్యవహారం వివాదాన్ని సృష్టించింది. పెంపుపై ప్రభుత్వం అనుకూలమైనా.. కొందరు అధికారులు వ్యతిరేకిస్తున్నారని యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి. -
మెడికల్ పీజీ సీట్ల ‘బ్లాక్’కు చెక్!
కొత్త నిబంధనలకు ప్రభుత్వం ఆమోదం సాక్షి, అమరావతి: తుది విడత కౌన్సెలింగ్లో పీజీ మెడికల్ సీటును ఎంపిక చేసుకున్న విద్యార్థి అందులో చేరాల్సిందే! లేకపోతే మూడేళ్లపాటు కౌన్సెలింగ్లో పాల్గొనడానికి వీల్లేకుండా డీబార్ కావాల్సి ఉంటుంది. చిట్టచివరి కంటే ముందు కౌన్సెలింగ్లో విద్యార్థి ఎంపిక చేసుకుని పొందిన సీటులో చేరకపోతే తుది విడత (తదుపరి) కౌన్సెలింగ్కు అర్హత కోల్పోయినట్లే. పీజీ మెడికల్ సీట్ల ‘బ్లాక్’కు చెక్ పెట్టడంలో భాగంగా ప్రభుత్వంఈమేరకు చర్యలు చేపట్టింది. ఐచ్చికాలు బ్లాక్ చేసుకోవడం వల్ల పీజీ సీట్లు భర్తీ కాకుండా వృథా అవుతున్న నేపథ్యంలో నిపుణులు, న్యాయస్థానాల సూచన మేరకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రూపొందించిన కొత్త ప్రవేశ నిబంధనలను ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు మెడికల్ పీజీ సీట్ల భర్తీకి నిబంధనలు, రిజర్వేషన్ విధానాలను సవరిస్తూ వైద్య విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం కట్ఆఫ్ తేదీలోగా పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయడంతోపాటు సీట్లన్నీ భర్తీ చేయడానికి ఈ నిబంధనలు ఉపకరిస్తాయని అందులో వివరించింది. విలువైన సీట్లు మిగిలిపోకుండా సద్వినియోగం చేయడం, సకాలంలో భర్తీ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలల ప్రవేశ నిబంధనలు – 1997ను సవరించినట్లు పేర్కొంది. సవరించిన నిబంధనలను ఈనెల 26న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్లో ప్రకటిస్తుంది. అప్పటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. -
687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్లకు సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2017– 18 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ సీట్ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఏదాది 687 పీజీ వైద్య సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. మొత్తం 11 వైద్య కళాశాలలుండగా అందు లో 8 కళాశాలల్లో మాత్రమే ప్రధాన విభాగాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.