ఆశించినమేర చేరని విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల్లో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఆశలు గల్లంతయ్యాయి. ఎక్కువ మొత్తం లో విద్యార్థులు చేరుతారనుకుంటే తక్కువ సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలోని 135 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జరిగిన కౌన్సెలింగ్‌లో కేవలం 3,115 మంది మాత్రమే సీట్లు పొందారు. ఈ సీట్ల కేటాయింపు వివరాలను ఆదివారం ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెల్లడించింది. కనీసంగా 25 వేల వరకు విద్యార్థులు తమ కాలేజీల్లో చేరుతారని యాజమాన్యాలు అంచనా వేసుకోగా.. అంత సంఖ్యలో విద్యార్థులు చేరలేదు.
అన్నీ సక్రమంగా ఉన్న 149 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 68,516 సీట్లు ఉంటే కౌన్సెలింగ్‌లో పాల్గొని ఆప్షన్లు ఇచ్చిన వారు 55,094 మంది మాత్రమే. అందులో 52,839 మంది విద్యార్థులకుసీట్లు లభిం చాయి. 15,677 సీట్లు మిగిలిపోయాయి. అఫిలియేషన్లు లభిం చని 161 కాలేజీలు సుప్రీంకోర్టును పలుమార్లు ఆశ్రయించాయి. గత నెలలో సుప్రీం కోర్టు వాటిలోనూ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం మైనారిటీ కాలేజీలు, సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే కాలేజీలు మినహా మిగతా 135 కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో ఉన్న 45,293 సీట్ల భర్తీకి ఈ నెల 5 నుంచి 7 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించింది.
3,261 మంది సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోగా 3,115 మం ది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఆదివారం సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 42,178 సీట్లు మిగిలిపోయాయి. ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 10, 11 తేదీల్లో సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సంప్రదించి అలాట్‌మెంట్ లెటర్‌పై ధ్రువీకరణ తీసుకుని ఈనెల 12వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని స్పష్టం చేసింది.
యాజమాన్యాల ఆశల గల్లంతు!
Published Mon, Nov 10 2014 2:15 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement